రాజగోపాల్ పేట విద్యార్థుల ప్రతిభ
 బాలల  దినోత్సవాన్ని పురస్కరించుకుని  తెలంగాణసాహిత్య అకాడమీ వారు జాతీయ స్థాయి లో  నిర్వహించిన వివిధ పోటీలలో  మొత్తం  400మంది విద్యార్థులు పాల్గొనగా  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,రాజగోపాల్ పేట విద్యార్థినులు ఇద్దరు బహుమతులు  గెలుచుకున్నారు.
పద్యకవితల పోటీలో G. సహస్రభారతి  తృతీయ బహుమతి సాధించి,1500/నగదు బహుమతి, మెమొంటో ,ప్రశంసా పత్రమును,కథల పోటీలో   A.రాజేశ్వరి ప్రోత్సాహక బహుమతి గా 1000/ నగదుబహుమతిని,మెమొంటో , ప్రశంసాపత్రాన్ని  సాధించారు
రవీంద్రభారతి లో   జరిగిన బాల సాహిత్య సృజన సదస్సు లో  తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి గారు


బాల చెలిమి సంపాదకులు డాక్టర్.మణికొండ వేదకుమార్ గారు, మొలక పత్రికా సంపాదకులు వేదాంతసూరి గారు.  అడిషనల్ కమీషనర్ రవీందర్ గారు సాహితీ వేత్తలు  గరిపల్లి అశోక్ గారు, డాక్టర్.సంగనభట్ల నర్సయ్య గారు, సంగనభట్ల చిన రామకిష్టయ్య,  డాక్టర్.  సమ్మెట విజయగారలు విజేతలకుబహుమతులు అందించారు.
కామెంట్‌లు