వేకువవకనే ముంగిట
వెండి బిందె చిలకరించు
వెలుతురు కళ్ళాపి నీరు
వెలిగించు జగతిని!
గూళ్లను వీడిన గువ్వల
కిలకిలల సవ్వడులు
లేళ్ళను కూడిన ఆవుల
సరసరల చేపులు...
తోటను విరిసిన పువ్వుల
తేటిని పిలిచే పిలుపులు
గాలులు మోసే గంధాల
తేలిన పరిమళ పలకరింపులు!
అడుగులు సాగే బాటను
వెలుగుల ముగ్గులు నింపి
వెచ్చగ మడుగులు ఒత్తగా
పచ్చగ తోచే లోకమంతా!
కలిసోచ్చే కలిమి కాలం
నడిచొచ్చే తోడు దైవం
గడిచినదేదీ మరలిరాదు
వచ్చినదేదీ మనతో ఉండదు
పంచిన ప్రేమలు
పాటించిన విలువలు
ప్రతిఫలించును కలకాలం
ప్రతి మనసున వారసత్వమై!
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి