లక్షలాది మంది ఆఫ్రికన్లకు నీటి ఎద్దడి తీర్చిన కుర్రాడి కథనమిది. అతని పేరు
ర్యాన్. కెనడాలో ఒక సాధారణ కుటుంబంలో ర్యాన్ 1991లో జన్మించాడు.
ఆ కుర్రాడి ఆరు సంవత్సరాల వయసులో, అతని గురువు ఒక కథ చెప్తూ నీటి ఆవశ్యకత గురించి వివరించాడు. ఆఫ్రికాలోని కొన్ని గ్రామాలలో, ప్రజలు తాగే నీరు కూడా లేకుండా నానా కష్టాలు పడుతున్నారు.... కొంతమందైతే నీటికొరతతో చనిపోతున్నారని గురువు చెప్పిన మాట ర్యాన్ చిన్న హృదయం ముక్కలైంది.
అతనికి నీళ్ళు కావాలంటే, ఇంట్లో కుళాయి దగ్గరకు వెళ్లి నీళ్ళు ఎలా తాగాలో అతనికి తెలుసు. కానీ కొంతమంది ఈ నీళ్ళు లేకుండా చనిపోతున్నారా అని అతను బాధపడ్డాడు.
అతను టీచర్ దగ్గరకు వెళ్లి,
“అక్కడి పిల్లలకు నీళ్ళు రావాలంటే మనం ఏమి చేయాలి, మనం నీటిని ఎలా సరఫరా చేయాలి?” అని అడిగాడు.
అప్పుడు టీచర్, వాటర్‌కాన్ అనే సంస్థ ఉంది, వారు దాదాపు 70 డాలర్లకు బావిని తవ్వి నీటిని అందిస్తున్నారని అంటారు.
అనంతరం ర్యాన్ నేరుగా ఇంటికి వెళ్ళాడు. తన తల్లితో నీటి సరఫరా విషయమై మాట్లాడాడు.
“అమ్మా... ఆఫ్రికాలో పిల్లలకు బావి ఏర్పాటు చేయాలని ఉందన్న మనసులోని మాటను చెప్పాడు. అంతేకాదు, తనకు ఓ డెబ్బై డాలర్లు కావాలన్నాడు.
కొడుకు మాటలకు తల్లి నవ్వింది.
“నువ్వు బాగా చదువుకుంటేనే నీ సొంత డబ్బుతో దాన్ని కొనగలవు” అని అమ్మ చెప్పింది. అతను ఆలోచనలో పడ్డాడు. డబ్బు ఎలా సంపాదించాలో అని ఆలోచించడం ప్రారంభించాడు. అయితే అప్పటికే తన తల్లి కోసం చిన్న చిన్న పనులు చేసి, కొంత డబ్బు సంపాదించి, పొదుపు చేయడం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో, తోటలో, ఆ ప్రాంతంలోని ప్రజలతో కలిసి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా అతను డబ్బు కూడబెట్టాడు. కొన్ని నెలల తర్వాత, అతని దగ్గర 70 డాలర్లకు పోగయ్యాయి.
కానీ అతను వాటర్‌కాన్ సంస్థ ప్రతినిధులను కలిసి విషయం చెప్పాడు. అయితే వారు అసలు ఖర్చు 2,000 డాలర్లు కావాలన్నారు. అయితే అతను ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు.
“నేను సంపాదించి మళ్ళీ వస్తాను” అని ర్యాన్ చెప్పాడు.
అతను మళ్ళీ పని చేసి డబ్బు ఆదా చేయసాగాడు. అతను చేపట్టాలనుకున్న మంచి పనికి ఇరుగుపొరుగువారందరూ సహాయం చేసి అవసరమైన డబ్బును పోగు చేశారు. వెంటనే, తన పాఠశాల సహాయంతో, 1999లో ఉత్తర ఉగాండాలోని ఒక గ్రామ ప్రజలకోసం అందరి సహకారంతో ఒక బావి తవ్వించాడు. ప్రజలు ఆ బావిని చూసి సంతోషంగా పరిగెత్తారు. ఈ క్రమంలో అకానా అనే బాలుడిని ర్యాన్ కలిశాడు. అకానా ఉంటున్న గ్రామంలోనూ నీటి ఎద్దడి తీర్చాలనుకున్నాడు. అప్పుడతనిని స్వాగతించడానికి ఆ గ్రామస్తులు వరుసలో నిల్చుని “ర్యాన్! ర్యాన్! జిందాబాద్” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అచిరకాలంలోనే ఆ గ్రామంలోనూ బావిని తవ్వించాడు. నీటి సమస్య తీర్చాడు. ఈ విధంగా పలు గ్రామాలకు తోడ్పడిన ర్యాన్
ఈరోజు పెద్దవాడయ్యాడు. ముప్పై ఏళ్ళు దాటాయి. అతనే స్వయంగా ర్యాన్స్ వెల్ ఫౌండేషన్ నడుపు తున్నాడు. 400 కంటే ఎక్కువ బావులను తవ్వించాడు. లక్షలాది మంది నీటి అవసరాలు తీరుస్తున్నాడు. అవసరమైన పిల్లలకు విద్యనూ అందిస్తూ బావులను ఎలా నిర్వహించాలో, నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలోనాని నేర్పిస్తున్నాడు.
ర్యాంప్ విషయంతో మనం తెలుసుకోవలసింది.... మంచి హృదయం ఉంటే చిన్నవారైనాసరే గొప్ప పనులు చేయవచ్చని. కల కంటే చాలదు, దానిని ఆచరణలో పెడితే ప్రపంచాన్ని మార్చొచ్చు. మంచి చేసే మనసే నిజమైన దేవుడనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకేముంటుంది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి