ఎప్పటికీ.... ఇం తే నా....! ;- కోరాడ నరసింహా రావు.

అధికారం తో ధనం... 
  ధనం తో అధికారం.... 
 ధన, అధికారాలతో... 
  సుఖ భోగాలు....! 

ఇవి మరిగిన మనిషిలో
   ప్రబలిన స్వార్ధ0 ! 

ఎన్ని మోసాలు... 
   ఎన్నెన్ని కుట్రలు... 
     కుతంత్రాలు... 
     బెది రింపులు... 
     దౌర్జన్యాలు - దోపిడీలు

మహిళ ల అవసరాలనే
 అవకాసాలుగా తీసుకుని
 వారి మాన,మర్యాదలతో
  బేర, సారాలు...! 

నాటి రాచరికము కన్నా
 నీచమైనప్రజాస్వామ్యము
  పరాయి పాలన కన్నా
 హేయమైన స్వపరిపాలన

ఆది నుండి... అనేక రూపా లుమారాయే గానీ ...పోని నియంతృత్వము...! 

మార్పు   రూపం లోనేనా
 గుణ0 లో  ఏదీ...!? 
 ఇప్పటికీ అదే పరిస్థితి ! 
  ఎ ప్ప టి కీ  ఇంతేనా..?! 
      *****
కామెంట్‌లు