ఆశల సౌధాలు:- కవి మిత్ర, సాహిత్య రత్న-అయ్యలసోమయాజుల ప్రసాద్.--పుష్యమి) - విశాఖపట్నం

 కలలు కనండి ఆ కలలను నెరవేర్చుకునే మార్గంలో
అవరోధాలు ఎన్ని ఎదురైనా
ఆదరక బెదరక  వెను దిరుగక
ముందుకు సాగితే విజయం నీదే అని
విద్యా వేత్త క్షిపణి నిపుణులు
పూర్వ దేశాధ్యక్షులు డాక్టర్  అబ్దుల్ కలామ్  చెప్పిన
ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం ఉండి  మంచి ఆశయ సాధనకు కృషి చేస్తే
సమాజాభివృద్ధి జరుగునన్న  స్వామి వివేకానంద వంటి 
మహానీయుల అడుగుజాడల్లో నడచి  వాటిని పాటిస్తే  అనుకున్నది సాధించవచ్చు
మన ఆశయలేన్నడు కాకూడదు అవరోధాలు
నిరక్షరాస్యత కులమత బేధాలు 
లింగవివక్షత స్త్రీ పురుష అసమానతలు పోవాలని
దేశం నాకేమిచ్చిందని  గాక దేశానికి నేనేమి చేశానన్నది  పాటించి 
స్వార్ధం సంకుచితం వదలి నిష్కళంక హృదయ ఆశయాలు ప్రగతికి సోపానాలు..!౹
..............................

కామెంట్‌లు