కరుణ నిండిన చూపులతో
కదలివచ్చు దైవానికి
కమ్మని రోజుని ఇమ్మని
కలలతో వినతులు
పాప పుణ్యముల లెక్కలు
కష్ట నష్టముల బాధలు
వెలుగు నీడల ఆటలు
తొలగి పోయె వరమిమ్మని....
కలిసి పోతూ అందరితో
కూరిమితో మెలగుతూ
మానవ విలువలు మనుగడలో
మరువక నెరపే ఇంగితమిమ్మని..
మదిలో తోచే మాటలే
పెదవిపై పలకాలని
పలికిన మాటలు చేతలలో
చేసి చూపే చేవ ఇమ్మని
కరుణను పరచే దీపానికి
చమురును కొంచెం పోయాలని
కలకాలం ఆ వెలుగులు
కన్నుల కాంతులు అవ్వాలని
ప్రభవించే వేకువలో
ప్రసరించే వెలుగులా
ప్రతిమదిలో ప్రమిదగా
ప్రకాశమిస్తూ బ్రతకాలని కోరుతూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి