విమర్శలకు కృంగిపోకూడదు!: - - యామిజాల జగదీశ్
 తప్పులు చేయని వ్యక్తంటూ చరిత్ర ఎవరూ లేరు! ప్రతి ఒక్కరూ తప్పులు చేసినవారే.
ఒక రోజు, ప్రముఖ శాస్త్రవేత్త
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ బ్లాక్‌బోర్డ్‌పై ఇలా వ్రాశారు :
9 x 1 = 09
9 x 2 = 18
9 x 3 = 27
9 x 4 = 36
9 x 5 = 45
9 x 6 = 54
9 x 7 = 63
9 x 8 = 72
9 x 9 = 81
9 x 10 = 91
ఇక్కడి తొమ్మిదో ఎక్కంలో
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒక తప్పు రాశారు. అది 9x10=91. కాబట్టి తరగతి గదిలో అకస్మాత్తుగా గందరగోళం నెలకొంది. గుసగుసలు. 
ఆయన చేసిన ఒక్క తప్పుకు విద్యార్థులందరూ ఆయనను చూసి పగలబడి నవ్వారు.
అయితే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అందరినీ నిశ్శబ్దంగా ఉండమని కోరారు.
“నేను తొమ్మిది తొమ్మిదల 81 వరకు  సరిగ్గానే రాశాను.‌ కానీ ఏ ఒక్కరూ  నన్ను హర్షించలేదు. కానీ నేను ఒకే ఒక్క తప్పు చేశాను. కావాలనే తొమ్మిది పదుల 91 అని రాశాను. దీంతో మీరందరూ ప్రశ్న నవ్వడం ప్రారంభించారు. ఇదికూడా తెలీదా అన్నట్లు చూశారు. నేను తెలియక రాశానంటే నేనూ సిగ్గు పడేవాడ్ని. కానీ మీ స్పందన ఎలా ఉంటుందో తెలిసింది" అని ఐన్ స్టీన్ అన్నారు.
ఒక వ్యక్తి ఎంత విజయం సాధించినప్పటికీ పట్టించుకోని సమాజం ఆ వ్యక్తే చిన్న తప్పు చేస్తే అవహేళన చేస్తుంది. నవ్వుతుంది.
కాబట్టి ఎటువంటి విమర్శలకైనా మన కలలను నాశనం చేసుకోకూడదు. చరిత్రలో ఎప్పుడైనిసరే ఏ ఒక్క తప్పూ చేయకుండా విజయం సాధించిన వ్యక్తంటూ ఉండరు. దీనికి ఎవరూ అతీతులు కారు.

కామెంట్‌లు