త్రిపుర 1972లో రాష్ట్రంగా అవతరించింది.బెంగాలీ,కొకొబొరోక్ ప్రధాన భాషలు.లంగర్ రాష్ట్ర జంతువు.రాష్ట్ర పక్షి గ్రీన్ ఇంపీరియల్ పిజియన్. రాష్ట్ర పుష్పం నగేశ్వర్ ఝంపీ ఎత్తైన కొండలశ్రేణి.ఆరెంజ్ నారింజ సంత్రా పళ్లు విస్తారంగా లభిస్తాయి.నవంబర్ లో ఆరెంజ్ టూరిజం ఫెస్టివల్ జరుగుతుంది.గోమతినది విశాలమైనది ప్రవహిస్తోంది.రవీంద్ర నాధ్ టాగూర్ కి త్రిపుర రాజులతో గాఢస్నేహం. ఆయన 20వ ఏటనే త్రిపుర రాజు మహారాజా బీరచంద్రమాణిక్య బహదూర్ ప్రశంసలు పొందాడు.టాగూర్ కి4తరాల రాజులతో స్నేహ బాంధవ్యాలుండేవి.
మహాభారతంలో త్రిపుర ప్రస్తావన ఉంది.14వశతాబ్దిలో మాణిక్య వంశం పాలించింది.3వేల ఏళ్ల పాలన చేసిన ఆవంశం ఇండో మంగోలియన్ మూలాలున్నది.ఈరాష్ట్రంలో 19 ఆటవిక జాతులున్నాయి.బెంగాలీ మణిపురికూడా ఉన్నారు.త్రిపుర జానపద ఆటవిక నృత్యాలకు పేరుగాంచింది.ఏప్రిల్ లో విత్తనాలు చల్లుతూ*గారియా* డాన్స్ చేస్తారు.గారియా దేవతను కొలుస్తారు పంటలు బాగా పండాలని. వర్షాకాలంలోరంగురంగుల పురుగులు*లెబాంగ్* కొండవాలుప్రాంతాల్లో గింజల కోసం వస్తాయి.వాటికి స్వాగతం పలుకుతూ లెబాంగ్ బూమాని డాన్స్ చేస్తారు.కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఛాక్మా తెగవారుబిజై డాన్స్ చేస్తారు.వాగలా డాన్స్ ,హైహాక్ డాన్స్, హోజగిరి డాన్స్ ప్రత్యేకత సంతరించుకున్న ఆదివాసీల నృత్యాలు.జానపద సంగీతంలోఖామ్,సుమై, సరిందా, డాంగ్ డూ,మొదలైన వాయిద్యాలు వెదురు పేముతో చేసినవి వాడుతారు.ప్రకృతి అందాలు జానపద జీవితాలు త్రిపుర రాష్ట్ర ప్రత్యేకతలు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి