సృజన పరిమళాలు:- పార్లపల్లి నాగేశ్వరమ్మ - ఊరు నెల్లూరు
సాహితీ కెరటాలు 
సాహితీ కవి కళా పీఠం
================
నవవధువు నవనీత హృదయాన వెలిగే నవ్య కాంతిలా ....,
 అత్తవారింటి వారు కానుకగా అలంకరించిన స్వర్ణభరణాల తళుకుల సొగసులా ..,
పుట్టింట తన వైభవాన్ని చాటాలని తపించే తరుణిలా ...,
కావ్యమాల అక్షరాల అలంకారాలతో ముస్తాబు చేసుకుని  మన ముంగిట..!

మేధో మధనంతో ఉద్భవించిన అమృత తుల్య శబ్ద తరంగాలు, 
కవివర్యుల కలం కమలాల నుండి జాలువారిన భావమాలికలు..,
 అక్షర శిల్పులు చెక్కిన అపురూప వాక్య రత్న ఖచితహారాలు.
 మన జ్ఞాన తృష్ణనుతీర్చుటకు మనోరంజన సాధనమై ....
సృజనాత్మకత నిరూపణకై పుస్తక రూపమై వెంచేస్తాయిఇలవేల్పులై ....!

నవరస సమ్మిళితగ్రంథాలు...., వ్యాకరణ సొగసులతో...,
చందోబద్ధ గమనంతో.., ముద్రణసౌరబాలసొయగాలతో ..,
జ్ఞానుల ,పుస్తక ప్రియులకు పలుకుతాయి ఆహ్లాద ఆహ్వానం ...!
అక్షరాల వైభవం కవి మేధో సంపత్తికి అసలైన కిరీటం !
కాదు కాదు ఇది కాగితాల సముదాయం అనంత భావ 
అనుభూతుల సంపదల నిలయం సాహిత్యం!!!
సాహిత్యమే సమాజానికి ప్రతిబింబం..,
మన సంస్కృతిసభ్యతల సమాహారం!!!

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Excellent... మేడం!!నమస్తే