చెట్లు: -జక్కుల అనన్య -ఏడవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బక్రిచెప్యాల జిల్లా సిద్దిపేట

 పిల్లల్లారా రారండి
కలిసి గుంతలు తీద్దాము
విత్తనాలు తెచ్చెదము
అందులోన నాటెదము
రోజునీళ్లు పోసెదము
చిన్నని మొక్కలు వచ్చెను
మాకు సంబుర మాయెను
ఆకులు మేకలు తినకుండా
చిన్నని కంచెలు వేసెదము.
మొక్కలు కాస్త చెట్లుయ్యాయి
చెట్లకు పువ్వులు పూశాయి
పూలు కాస్త కాయలయ్యెను
కాయలు కమ్మని పండ్లుగ మారెను
పిల్లల మంతా కలిశాము
పండ్లను మేము తిన్నాము
పండ్లు శక్తిని ఇచ్చేను 
చక్కని చదువులు చదివాము
కామెంట్‌లు