నేల తల్లి మనకు, తండ్రి తానె...!
నీట బుట్టిన నేల జీవులను బుట్టించె...!
ఆ జీవులలొ వానరులు మెరుగుగా తలపించె...!
ఆ వానరులె నరులుగా పరివర్తనము చెందె...!
ఈ నేల తల్లియే...
ఓషధులను మనకు ఆ హారముగ అందించె...!
శుక్ల,సోనితములు అందుండి జనియించె ..!
అండమే పిండమై...స్త్రీ, పురుషులయ్యె...!
పుట్టుకకు, వృద్దికిని నేల యే మూలము...!
తుదకు... మరణించినా, ఆనేల తల్లియె...మనల
తన ఒడినె దాచు...!!
మట్టియె మొక్కకు సారమై బెంచును...!
ఆ మొక్కలే మనకు ప్రాణ వాయువు నిచ్చు...!
మనకు నీటి నందించు టకు నింగి, నేలలే మూల ము...!
భూ కాలుష్యమే, జల వాయు కాలుష్యకారకము
భూమిని కాలుష్యము నుండి కాపాడుకొనుటనిన
మనల మనము కాపాడు కొనుటయే...!!
నేల తల్లిపై నిర్లక్ష్య మేనా టికీ తగదు....!
*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి