రేపన్నది ఉంటుందన్నా
నేడే నిజమైనది.
నాడు జరిగిందన్నా
ఈనాడే కనబడేది.
ఏనాడూ తేలేదీ కాదన్నా
మర్నాడే మాయైనది.
నడుస్తున్నది ఔనన్నా
నడిపేది సందేహమైనది.
తెలిసినా,తెలియకున్నా
మునిగేది ఖాయమైనది.
కదిలేది లేదన్నా
కలిసేది కాకతాళీయమైంది.
ఒక్కటే మిగిలేదన్నా
ఓటమి వెక్కిరించింది.
స్పష్టత సాపేక్షమైనా
వివక్షత విధియైంది.
రంధి రాణియైనా
సైరంధ్రి శాపమైనది.
సోయి సోపతైనా
కసాయి కాలమైనది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి