ఒడిషా! అచ్యుతుని రాజ్యశ్రీ

 భువనేశ్వర్ రాజధాని గా ఉన్న ఒడిషా భాష ఒరియా.మేల్ ఇండియన్ పీ ఫౌల్ రాష్ట్ర పక్షి, ఏనుగు రాష్ట్ర జంతువు ,లోటస్ రాష్ట్ర పువ్వు.ఒడిషా ప్రాచీన పేర్లు  ఉత్కళ  కళింగ ఓడ్రదేశం.కళింగయుద్ధంతో అశోకునిలో మార్పు వచ్చి బౌద్ధంస్వీకరించాడు.1568లో హిందూరాజ్యం కాస్తా ముస్లింల ఆపై అక్బర్ చేతిలో పడి 1803 తర్వాత  బ్రిటిష్ పాలనలోకి వెళ్లింది.ఇసుకపై చిత్రాలు,శిల్పాలు  ప్రత్యేకకళ. ప్రసిద్ధ కవి బలరాందాస్  జగన్నాథ స్వామి రథం ఎక్కాలని ఆశపడితే, అనుమతి లభించలేదు.విషాదమనస్కుడై బీచ్ కెళ్లి ఇసుక పై జగన్నాథ సుభద్ర బలభద్రుని చిత్రించి ప్రార్థన చేశాడని ఆనాటినుంచి సైకతశిల్పాలు ఒడిషాలో ప్రత్యేక కళగా వెలుగులీనుతున్నాయని జనశృతి. ఆప్లిక్ వర్క్,వెండి కంచు చెక్క తో చేసిన వస్తువులకి ఒడిషా ప్రసిద్ధి.13వ శతాబ్దిలో వెలిసిన కోణార్క్ సూర్య దేవాలయం ఓఅద్భుతం. కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ ప్రతి డిసెంబర్ లో ఈఆలయప్రాంగణంలో జరగటం ఓవిశేషం.దేశంలోని నృత్య కళాకారులంతా పాల్గొనడం తో ఓపండగవాతావరణం ఏర్పడుతుంది🌹
కామెంట్‌లు