రవీంద్రభారతి లో కవి అయ్యలసోమయాజుల ప్రసాద్ కు ఆత్మీయ సాహితీ సత్కారం.

 వీక్షణం కాలిఫోర్నియా అమెరికా  అంతర్జాతీయ సాహితీ సంస్థ భాగ్యనగరంలో  రవీంద్రభారతిలో 160 వ   సదస్సు సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనం లో కవి, రచయిత సాహిత్యరత్న  ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ విశాఖపట్నం 'వీక్షణమే ప్రగతికి సోపానం' అని కవితాగానం చేయగా  వ్యవస్థాపకురాలు డాక్టర్ కె. గీతామాధవి గారు , భారతదేశ ప్రతినిధి శ్రీ గుండవల్లి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రముఖ కవియత్రి కుసుమధర్మన్న కళాపీఠం వ్యవస్థాపకురాలు  కవి సమ్మేళనం నిర్వాహకురాలు  డాక్టర్ రాధాకుసుమగారు విశిష్ట అతిధి సినీ నటులు సుబ్బరాయ శర్మ, ప్రముఖ సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య 
 నాళేశ్వరం శంకరం గారు .
తెలంగాణ జంటనగరాల తెలుగు రచయిత సంఘ అధ్యక్షుడు  కందుకూరి  శ్రీరాములు గారి సమక్షంలో  దుశ్శాలువతో శుభాకాంక్షలు  తెలియచేస్తు ఆత్మీయ సత్కారం చేసారు .బదులుగా కవి ప్రసాద్ రవీంద్ర భారతిలో సాహితీమూర్తుల సమక్షంలో జరిగిన  సన్మానం మధుర జ్ఞాపకమని సంతోషం వ్యక్తం చేసారు.
............................
కామెంట్‌లు