ఆటవెలదులు
***"""**
నీవు తప్ప నెవరునిజముగా లేరయ
నమ్మవయ్య నన్ను,యమ్మ తోడు.
అవసరమ్ము గనుక యడుగు చుంటిని గదా
నివ్వవయ్యనమ్ము నిజముగాను.
2
తిరిగి ఇవ్వగలను దేవుని మీదొట్టు
రోజు గడిచి నాకు రొక్కమొచ్చు.
పువ్వులందు పెట్టి పొందుగా
నిత్తును
సత్యవాక్కుకన్న సాటి లేదు.
3
అయ్య,గడిచె నెలలు యప్పుతీర్చ మనుచు
అడిగి నపుడు చెప్పె నతడు బదులు.
తొందరేమి నీకు తొందరలో నిత్తు
వచ్చు రేపునాకు వంద వేలు.
4
మాటలందుచూడు మార్పులు కూర్పులు
బ్రతకనేర్చియుండ
భయము లేక
యప్పు నిచ్చి నట్టి యాతని నేమార్చె
మాటలందుగారడ న్న నిటులె.
🌹స్వస్తి🌹
🙏🏼శుభం🙏🏼

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి