వందేమాతరం.: -కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-హైదరాబాద్.
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భరతావని
విభిన్న సంస్కృతి సంప్రదాయల కలయిక
తెల్లదొరల కబంధ హస్తాలలో బందీగా నిలిచిన
భారతమాత దాస్య శృంఖలాలను 
ఎందరో దేశభక్తుల,త్యాగధనుల పోరాటానికి
ప్రేరణనిచ్చిన  బంకింశ్చంద్ర చటర్జీ  వ్రాసిన
వందేమాతరం గీతం 
పసిపిల్లలనుంచి పండుముదుసలి వరకు
ప్రభంజనంలా వ్యాపించి
కులమత, జాతిమత, లింగబేధాలకు అతీతంగా
దేశప్రజలంతా ముక్తకంఠంతో
మమేకమై నినందించి
వందేమాతరం, విప్లవం వర్ధిల్లాలి అని
బలిదానం చేసిన భగత్ సింగ్ ,అల్లూరి వంటి విప్లవ వీరులు
విదేశీ వస్తు బహిష్కరణ
క్విట్ ఇండియా, దండి సత్యాగ్రహంలో 
వందేమాతరం అంటు  మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయి  
పటేల్, సరోజనీ నాయిడు  డాక్టర్ అంబేద్కర్  
వంటి ఎందరో మహానీయులు నినదించి
బ్రిటిష్ దొరల సింహస్వప్నమై నిలచిన
నా జాతీయ గీతం  వందేమాతరం
వసుదైకానికే ఆదర్శం
నూట ఏబది ఏండ్ల  వందేమాతరం 
మా భారతీయుల గాయత్రీ మంత్రమే...!!

  వందేమాతరం
భారతమాతాకి జై.
...........................


కామెంట్‌లు