తల్లి అనురాగం : వెంకట్ , మొలక ప్రతినిధి
ఏడు కుక్క పిల్లలూ…
చల్లని నేలపై వణుకుతూ తల్లి వైపు పరుగెత్తగా,
ఆమె ఒంటి వేడి వారికో గుడారమై,
పాల కోసం ఎగబడ్డ ప్రతి చిన్న నోరు —
ప్రేమకు కొత్త అర్థం చెప్పింది.

అమ్మ కళ్లలో అలసట ఉన్నా,
మమత మాత్రం అలసరాదు.
తన శరీరాన్నే ఆహారమై చేసి,
ఏడు హృదయాలకు జీవం పోసే దైవం —
తల్లి కన్నా గొప్ప నేలపై ఎవరు?

ఆ దృశ్యం చూడగానే తెలుస్తుంది —
ప్రేమ అనేది మాటల్లో కాదు…
చిన్న చిన్న ప్రాణాల ఆకలిని తీరుస్తున్న
ఆ తల్లి హృదయంలోనే 
మమత పేగు బంధం కనబడుతుంది

కామెంట్‌లు