మీకోసం నేనుఈ కొత్త సంవత్సరాన్ని కోరేదొక్కటే..!మీరు పట్టింది బంగారమై...ముట్టింది ముత్యమై...ప్రతి దినం శుభదినమై...ఆయురారోగ్యఐశ్వర్యాలతోకలకాలం కిలకిల నవ్వుతూ బ్రతకాలని...మీకోసం నేనుఈ కొత్త సంవత్సరాన్ని కోరేదొక్కటే..!మీ గతం మధుర గానమై...వర్తమానం వసంత భరితమై...భవిష్యత్తు బంగారు బహుమానమై...సిరిసంపదలతో సుఖశాంతులతోసకల సౌభాగ్యాలతో మీరు వర్ధిల్లాలని...మీ కోసం నేనుఈ కొత్త సంవత్సరాన్ని కోరేదొక్కటే..!చిరునవ్వుల్ని చిందించమని...సిరిసంపదలని అందించమని...మీరు కన్న కమ్మనికలల్ని కంచికి పంపమని...మీకున్న ఆశల్ని అమృతంతో నింపమని...మీ కోసం నేనుఈ కొత్త సంవత్సరాన్ని కోరేదొక్కటేనా మాట వినమని...మీ కష్టాలను కన్నీళ్లను కొనమని...నా మాట నమ్మమని...మీకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని అమ్మమని..మీ కోసం నేనుఈ కొత్త సంవత్సరాన్ని కోరేదొక్కటే..!మీ బాధల్ని భయాన్ని బంధించమనిమీకు అమర సుఖాలనందించమని...మీ కష్టాలను కన్నీళ్లను కరిగించమని.. ప్రశాంతమైనజీవితాన్ని మీకు ప్రసాదించమని...అందుకే ఓ నా ప్రియమిత్రమా..!ఈ జీవిత సంద్రాన పుట్టు...సుఖదుఃఖాలు సుడిగుండాలు..!గట్టెక్కిస్తే కృతజ్ఞతగా పెట్టుకొత్త సంవత్సరానికి కోటి దండాలు..!
ఈ కొత్త సంవత్సరాన్ని నేకోరేదొక్కటే..! :- కవిరత్న -సాహిత్యధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్పల్లి -అత్తాపూర్ హైదరాబాద్
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి