ఎన్నడు...!? ఎప్పుడు?! :- కోరాడ నరసింహా రావు.

 మన మెంత నిశ్చలంగా ఉండా లనుకున్నా.... 
   కళ్లు మూసుకు స్థిరంగా ఓ చోట కూచున్నా... 
   ఛంచల మైన మనసు నిశ్చలముగా నుండదే..! 
   చేతిలో జపమాల తిరుగుతున్నా... 
   పెదాలు నామ స్మరణ చేస్తున్నా... 
   విషయాల వెంట అది పరుగులు తీయటంఆపదే...! 
   ధ్యానం సాగాలంటే... 
 యోగం కుదరాలిగా..!! 
  యోగం కూదరాలంటే... 
మనసుకు మారుపేరైన శ్వాస ను అదుపు చెయ్య వలసిందే...! 
   శ్వాసను అదుపు చెయ్యట మంటే... 
   నామ స్మరణ స్థానంలో శ్వాస మీద ధ్యాస పెడితే సరి...! 
  స్థిరంగా కూచోటం... 
  కళ్ళు  మూసుకోటం... 
  జపమాల తిప్పటం... 
     నామజపం చెయ్యటం
ఇలా మొదటి మెట్టుమీదే ఎ న్నా ళ్లు...!! 
 యోగం కుదిరే దెన్నడు?! 
   గమ్యం చేరే దెప్పుడు ...!? 
       ******
కామెంట్‌లు