కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ సర్పంచి రేకుల జ్యోతి ఆధ్వర్యంలో పాలకవర్గం సోమవారం కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలకు కావలసిన అవసరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యను అడిగి తెలుసుకున్నారు. పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాన్ని (ప్రీ ప్రైమరీ సెంటర్) సందర్శించి పిల్లల కోసం ప్రభుత్వం అందజేసిన అద్భుతమైన, ఆకర్షణీయమైన ఆట వస్తువులు, ప్లే మెటీరియల్ ను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పాఠశాలకు కావలసిన అవసరాలను సర్పంచి దృష్టికి తీసుకెళ్లారు. అతి త్వరలోనే పాఠశాలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తానని ఆమె తెలిపారు. అనంతరం గంగారం గ్రామపంచాయతీ సర్పంచి రేకుల జ్యోతి, ఉప సర్పంచి, వార్డు సభ్యులను ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య శాలువాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. చదువుతోనే సామాజిక చైతన్యం సాధ్యమవుతుందని, అందుకోసమే పిల్లల చదువు పట్ల తాను ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తున్నానని, పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఈర్ల సమ్మయ్య అన్నారు. ఈ సందర్భంగా సర్పంచి జ్యోతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు సురేష్ కుమార్, స్రవంతిలను శాలువాతో ఘనంగా సత్కరించారు. అందరూ కలిసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య స్పెషల్ వర్కర్ పైడిపల్లి విజయలక్ష్మిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి రేకుల జ్యోతి, ఉప సర్పంచి మేడి అశోక్ గౌడ్, వార్డు సభ్యులు ఆవుల సునీత, ముస్కే కుమారస్వామి, బొజ్జ పద్మ, మిరియాల మల్లేష్, చిక్కుల వంశీ, ముస్కె స్రవంతి, కూస లత, గ్రామస్తులు రేకుల రఘు, హెచ్.ఎం. ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, ఎడ్ల స్రవంతి, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.
పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తా:- -గంగారం సర్పంచి రేకుల జ్యోతి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి