రామ్ సతార్ కు అక్షర నివాళి: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-హైదరాబాద్.
ఆయన చెక్కిన శిల్పాలలో జీవకళ ఉట్టిపడుతుంది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాట్యూ ఆఫ్ యూనిటి
నర్మదానది తీరాన  నిర్మించిన
ఉక్కు మనిషి నిష్కళంక దేశభక్తులు
సర్ధార్ వల్లభాయి పటేల్ విగ్రహం.
తెలంగాణ రాష్ట్ర రాజధాని
హైదరాబాద్   ట్యాంక్ బండ్ సమీపంలో
ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ స్మృతివనంలో  నిర్మించిన
రాజ్యాంగశిల్పి  కాంస్య విగ్రహం
కర్ణాటకలోని విధాన సౌధలోని మహాత్మ గాంధీ ప్రతిమ
కురుక్షేత్రంలో కృష్ణార్జునులు
ఎన్నో ఎన్నెన్నో శిల్పాలకు
ప్రాణం పోసిన
రామ్ సతార్ మీరు అత్యున్నత పద్మశ్రీ ,పద్మభూషణ్ ఠాగూర్  పురస్కారాలకే వన్నె తెచ్చారు
శతసంవత్సరాలు పూర్తి చేసుకుని
మీరు శ్రీరామచంద్రుని దరి చేరడం
బాధాకరమైన "జాతస్యహి ధృవో మృత్యు:" అని తెలిసి
మీకివే సమర్పిస్తున్న నా అక్షర నివాళి..!!
==========================================

( ప్రపంచ ప్రసిద్ధ  ఐక్యతామూర్తి రూపొందించిన రామ్ సతార్ డిసెంబర్ 18 వ తేదిన 101 వ సంవత్సరాల వయస్సులో  శివైక్యం చెందిన సందర్భంగా వ్రాసినది)


..............................

కామెంట్‌లు