మధురం అక్షర పరిచయం:- : రాజ్యలక్ష్మి శశిధర్. K
సాహితీ కెరటాలు
================
తెలుగు అక్షరం – భావి తరం కోసం
తెలుగు అక్షరం మా శ్వాసలో నిండిన స్వరం
తల్లిపాలలా మనసుకు పట్టిన మధుర వరం
గడచిన కాలాల గాధల్ని మోసుకొచ్చిన దీపం
భావి తరానికి దారి చూపే జ్ఞాన ప్రదీపం

ఒక అక్షరంలో దాగి ఉంది సంస్కృతి వెలుగు
ఒక పదంలో మెదులుతుంది జీవన తలుగు
తాతల కలలు, తల్లుల ఆశలు
అక్షరాల రూపంలో నిలిచిన ఆశయ శిఖరాలు

కాగితంపై పడితే కవితగా వికసించే బీజం
నోట పలికితే హృదయాలను కలిపే బంధం
భాషను కాపాడటం మన బాధ్యతే కాదు
భవిష్యత్తుకిచ్చే అమూల్యమైన వరం కూడా

తెలుగు అక్షరాన్ని చేతిలో పెట్టి నడిపిద్దాం
భావి తరానికి వెలుగైన మార్గం చూపిద్దాం

కామెంట్‌లు