మనసును గెలిచిన వారే జీవితాన్ని గెలుస్తారు:ప్రముఖ సైకాలజిస్ట్ బీవీ సత్య నగేష్ : - KVM వెంకట్ , మొలక ప్రతినిధి
 తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులకు శ్రీ రామకృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ 
విద్యార్థులు మానసిక ప్రశాంతతతో లక్ష్యసాధన చేయాలి :
ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ సీనియర్ ప్రొఫెసర్ చింత గణేష్
=====================================================
శ్రీ రామకృష్ణ సేవ సమితి తాండూరు వారి ఆధ్వర్యంలో ఇంటర్ చదువుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు భాష్యం కళాశాల విద్యార్థులకు రానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో భయాన్ని దూరం చేయడం కోసంమోటివేషన్ క్లాస్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్ట్, హైప్నోథెరపీ నిపుణుడు బీబీ సత్యా నగేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరీక్షల్లో విజయం సాధించాలంటే విద్యార్థులు ముందుగా మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలని,మనసు గెలిచిన వారి జీవితాన్ని గెలుస్తారు మొదట ఒత్తిడిని జయించి లక్ష సాధన కోసం కృషి చేయాలన్నారు మెమరీ టెక్నిక్స్ ని విద్యార్థులకు అవగాహన కల్పించారు 
అంగవైకల్యం ఉన్న సివిల్ సర్వీసులో సార్ రాణిస్తున్నారు అంటే విజయం సాధించడానికి సాకులు మాని లక్ష్యం పైన దృష్టి పెట్టాలన్నారు దానికి శ్రద్ధ ఉండాలన్నారు తనకి విద్యార్థులు ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలన్నారు. లక్ష్యంపై స్పష్టత ఉండాలని సూచించారు. పోటీ పరీక్షల్లో గెలుపొందాలంటే క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం, సానుకూల ఆలోచన అవసరమని అన్నారు. ఒత్తిడిని నియంత్రించుకోవడం ద్వారా ఏ పరీక్షనైనా ధైర్యంగా ఎదుర్కొవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్, సీనియర్ ప్రొఫెసర్ చింత గణేష్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆంగ్ల భాషతో పాటు అన్ని సబ్జెక్టులపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంచి పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం మాత్రమే కాకుండా ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసం కూడా పెరుగుతుందని తెలిపారు.పోటీ పరీక్షలు ప్రిపేర్ జనరల్ స్టడీస్ తో పాటు నిత్యము న్యూస్ పేపర్ ని చదవాలని అన్ని సబ్జెక్టులపై కమాండింగ్ పెంచుకోవాలన్నారు అప్పుడే తమ యొక్క లక్ష్యసాధన సాధ్యమవుతుంది అన్నారు ఆశయం ఉన్నతంగా పెట్టుకోవాలని దాని సాధించడం కోసం నిరంతరం శ్రమించాలన్నారువిద్యార్థులు చదువును భయంగా కాకుండా ఆసక్తిగా మార్చుకుంటే విజయమే తమ వెంట ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గంగోత్రి విద్యాలయ విద్యార్థులు నిన్ను నీవు మార్చుకో
సాంగ్ అందరినీ అలరించింది ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు 
బాలకృష్ణ రామకృష్ణ వివేకానంద భావ ప్రచార రాష్ట్ర కార్య కోఆర్డినేటర్ ఇన్ సూర్య ప్రకాష్ 
గౌరవ దీక్షలు బస్వరాజ్ పోగ్రామ్ కన్వీనర్


KVM వెంకట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ మల్లయ్య భాష్యం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ రమేష్ కారివేరి సభ్యులు మోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గోపాల్ రెడ్డి అరవింద్ నరహరి రాములు ప్రభుశంకర్ తో పాటు ఉపన్యాసకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని నిర్వాహకులు తెలిపారు.
కామెంట్‌లు