దివినుండి భువికి దిగివచ్చిన మహోన్నతుడు ఆచార్యుడు
ధర్మమే అతని ఆయుధం దీక్షాపరుడు పూజ్యుడు
వెన్నంటి ఉంటూ ఈ నాగరికతకు అర్థం నేర్పే దయనీయుడు
సరస్వతీ కటాక్షం ఆవహించిన అనితరసాధ్యుడు
విద్యార్థుల మనోభావాలను గ్రహించే సవ్యసాచి అతడు
క్రమశిక్షణను నేర్పించి వారి ఆలోచనలు స్వీకరించేవాడు
స్వీయ అనుభవాలతో విద్య నేర్పే ఉపాధ్యాయుడు
విశ్వ జగతికీ విజయాలను చేకూర్చే త్యాగధనుడు
తను సంపాదించిన జ్ఞానాన్ని అందించే శ్రీవత్సలుడు
విజ్ఞానాన్ని వివిధ కథలుగా మలిచే శ్రేష్టుడు
నిగూఢమైన ఆలోచనలు ఉన్న సంపన్నుడు
స్వార్ధ చింతన లేని తపస్వి ఈ దేవుడు
సంఘంలో నీ పేరును నిలిపే నీలాంబరుడు
నీతి కథలతో శిఖరం అంచున నిలబెట్టే ధీరుడు
కమ్మని పలకరింపులతో ముచ్చటించే మృదుస్వభావుడు
అన్ని భాషలను అవలీలగా నేర్పే అవధానుడు
జన్మనిచ్చిన తల్లిదండ్రిల కాపాడే కరుణామయుడు
జననీ జన్మభూమి అని నిత్యం పలికే ఘననీయుడు
ఆదర్శవంతుడు అందరినీ మేల్కొలిపే భగీరథుడు
నిజాయితీకి మారుపేరు ఈ చాణిక్యుడు
స్వాతిముత్యంల మెరిసే స్వచ్ఛమైన వాడు
విజ్ఞులు విధాతలు విధేయులు మన మనసును దోచిన గురువులు
ఈ పండితులు మనలను ముందుకు నడిపే వారధులు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి