పిడికెడంత గుండెకెన్ని
సంవేదనలో!
మనసు పడిన వారి కోసం
మరణవేదనే.
కాలమిచ్చిన ఖాళీకి,
కనలిపోయే చిత్రం.
ప్రేమకు ప్రేమ పెట్టే పరీక్షలో
ఫలితమే అదృష్టం.
పదిలమైన పరిస్థితుల కోసం
ప్రణయశూన్యత పరిహాసం.
గాయానికి కూడా గజల్ గాంభీర్య
మద్దుకునే ఔచిత్యం.
ఆవిరవుతున్న వయస్సుకు
అద్దమవుతున్న మనస్సు.
ఋతుసంహార నైషధాలను
గుదిగ్రుచ్చినట్లున్న వాస్తవం.
ప్రకృతి పచ్చదనాల్లో దాగున్న
తుషారబిందువుల వలె,
ఆర్ద్రతను నయనాలనుండి
విడుస్తున్న రాగపరాగ వివశత్వం.
జీవనినాద అమరత్వమే చిరజీవ జీవన్మరణమై జీరబోతున్న స్వరం.
నిర్మోహ నిర్వేదానికి నిస్తేజాశ్రువుల అభిషేకం.
నీడలా నడవాలనుకున్న నిజానికి మబ్బులు పట్టిన వైనం.
పొదరిల్లే తుఫాను ధాటికి
విడివడిన దృశ్యం
సింగిడి వర్ణాలే షడ్రుచుల సారం.
సెలవు లేని చింతకు
సెలవనలేని దౌర్భాగ్యం.
కలవగలిగే దూరాన ఉన్నా,
కాల్చివేసే దురదృష్టం.
(వాట్సప్ పరిభాషలో XOXO అంటే లాట్స్ ఆఫ్ హగ్స్ అండ్ లాట్స్ ఆఫ్ కిసెస్ అని అర్థం)
సంవేదనలో!
మనసు పడిన వారి కోసం
మరణవేదనే.
కాలమిచ్చిన ఖాళీకి,
కనలిపోయే చిత్రం.
ప్రేమకు ప్రేమ పెట్టే పరీక్షలో
ఫలితమే అదృష్టం.
పదిలమైన పరిస్థితుల కోసం
ప్రణయశూన్యత పరిహాసం.
గాయానికి కూడా గజల్ గాంభీర్య
మద్దుకునే ఔచిత్యం.
ఆవిరవుతున్న వయస్సుకు
అద్దమవుతున్న మనస్సు.
ఋతుసంహార నైషధాలను
గుదిగ్రుచ్చినట్లున్న వాస్తవం.
ప్రకృతి పచ్చదనాల్లో దాగున్న
తుషారబిందువుల వలె,
ఆర్ద్రతను నయనాలనుండి
విడుస్తున్న రాగపరాగ వివశత్వం.
జీవనినాద అమరత్వమే చిరజీవ జీవన్మరణమై జీరబోతున్న స్వరం.
నిర్మోహ నిర్వేదానికి నిస్తేజాశ్రువుల అభిషేకం.
నీడలా నడవాలనుకున్న నిజానికి మబ్బులు పట్టిన వైనం.
పొదరిల్లే తుఫాను ధాటికి
విడివడిన దృశ్యం
సింగిడి వర్ణాలే షడ్రుచుల సారం.
సెలవు లేని చింతకు
సెలవనలేని దౌర్భాగ్యం.
కలవగలిగే దూరాన ఉన్నా,
కాల్చివేసే దురదృష్టం.
(వాట్సప్ పరిభాషలో XOXO అంటే లాట్స్ ఆఫ్ హగ్స్ అండ్ లాట్స్ ఆఫ్ కిసెస్ అని అర్థం)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి