ఏక్ భారత్- శ్రేష్ట్ భారత్.!: - డా. పి వి ఎల్ సుబ్బారావు,-04410 58797
 నా పంచ పదుల సంఖ్య----
1134.
       భారతజాతి ఏకమయ్యే,
        ఘన జాతీయ పర్వదినం!
     ఆగస్టు పదిహేను దేశాన,   
          బానిసత్వ విమోచనం!
    
    జనవరి ఇరవై ఆరు,
     స్వ పాలన అవగాహనం!
ప్రజాస్వామ్యాన రాజ్యాంగం, 
   అమలు అయిన శుభదినం!
భారతరాజ్యాంగం ప్రతిపౌరుడి, జీవన పాఠ్యగ్రంధం, పివిఎల్!
1135.
   స్వాతంత్ర్యం అర్థం ప్రగతిరథ,
          సదా పురోగమనము !
  ఆ ప్రగతి గతి వీక్షణం,
       గణతంత్ర దినోత్సవము!
  దేశ రక్షణ సామర్థ్యం, 
      త్రిదళ బల ప్రదర్శనము!
   దేశ సంస్కృతి కళా వైభవ,   
         చందన పరిమళము!
సారే జహాసే అచ్చా,
 హిందూ సితా హమారా,   
      సాక్షాత్కారం, పివిఎల్!
1136.
"ప్రజల చేత" ఎన్నుకోబడే, ప్రభుత్వము!
"ప్రజల వలన" నడుస్తున్న, ప్రభుత్వము!
"ప్రజలకొరకు" పాటుపడే, ప్రభుత్వము!
ప్రజలే ప్రజాస్వామ్య ,
దివ్య సౌధ మూలము! 
వందేమాతరం ,
జాతి జపించే మహా మంత్రం, పివిఎల్!
1137.
"విధి నిర్వహించు",
      " ఫలితం ప్రాప్తించు",
                     గీతాసారమది!
రాజ్యాంగం పౌరుల ,
ప్రాథమిక విధులు నిర్దేశించింది!

"అవి పాటించు" ప్రాథమిక, హక్కుల అర్హత వస్తుంది!
మంచి పెంచి జీవించు ,
పోయినా సార్ధక జీవనమది!
నీ పూర్వజన్మ పుణ్యమది, గణతంత్ర విధానమిది, పివిఎల్!
_________


కామెంట్‌లు