వినరో భాగ్యము విష్ణు కథలు:(12):- ఎం బిందుమాధవి

 సాయంత్రం ఐదు గంటలు అయింది. హోమ్ వర్కులు గబ గాబా ముగించి పిల్లలంతా బామ్మ చుట్టూ చేరారు. బామ్మ పెరట్లో కాసిన జామకాయలు తరిగి ఉప్పు , మిరియం పొడి వేసి తయారుగా పెట్టింది. అందరూ తల ఓ ముక్క నోట్లో పెట్టుకుంటూ..”బామ్మా ఈ రోజు శ్లోకాలు నువ్వు చెబుతావా? తాతయ్య పడుకున్నారు. ఇంకా లేవలేదు” అన్నారు.
“అలాగే. మరి నిన్న తాతయ్య ఏం చెప్పారో నాకు తెలియదు కదా! ఇవ్వాళ ఎక్కడ ప్రారంభించాలో తెలియాలంటే..మురళీ..నువ్వు నిన్నటి శ్లోకాలు, వాటిలో నీకు ఏమి అర్థమయిందో చెబుతావా” అన్నది బామ్మ.
“అనాది నిధనో ధాతా విధాతా ధాతురుత్తమ:
అప్రమేయో హృషీకేశ: పద్మనాభో ఽమరప్రభు:
అన్నాడు మురళి, కళ్ళు మూసుకుని బామ్మకి అప్పచెబుతూ!
“సరే ఇవ్వాళ ఇంకా కొంచెం వివరంగా చెప్పుకుందాం! ఏ నాటి నించో..అంటే ఆ దేవ దేవుడు ఎప్పటి నించీ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సృష్టి చేసిందే ఆయన అనుకున్నాం కదా! మనందరినీ, మన తాత ముత్తాతలని, మన కంటే ఎన్నో వేల ఏళ్ల నించి ఉన్న అన్ని జీవులని సృష్టించింది ఆయనే. కాబట్టి ఆయన మొదలు, ఆయన వయసు మనకి తెలియదు. మొదలు తెలుసుకోలేని ఆయనని ‘ధాతా’ అంటారు. అంటే ప్రస్తుతానికి ‘విత్తనం రూపం’ అనుకుందాం..అలా అన్ని జీవరాశులు పుట్టటానికి మూలమైన, కారణమైన పదార్థం ‘ఆయన’ అనుకుందాము. అంటే చెట్టు మొలకెత్తటానికి అవసరమైన విత్తనం లాగా అన్నమాట.”
“అలా చెట్టు, జంతువు, పక్షి, కీటకం, పర్వతం లాంటివి సృష్టించి అవి ఎలా ఉండాలో నిర్ణయించిన వాడు ఆయన. అంటే..చెట్టు పైకి గాలిలోకి కొమ్మలు, రెమ్మలు, ఆకులతో పెరగటం, లత లాంటి తీగలు నేలబారుగా పాకటం..లేదా ఆధారం చూపిస్తే దాన్ని అల్లుకుని పైకి ఎగబాకటం, జంతువు భూమికి అడ్డంగా నాలుగు కాళ్లతో నడవటం, మనిషికి రెండు కాళ్లు, రెండు చేతులు ఉండి నిలువుగా నడవటం, అన్ని జీవులకు ముఖం, ఉదరం, కళ్ళు, చెవులు, నోరు ఉండే లాగా ఒక రూపాన్ని నిర్ణయించటం అనే పనులన్నీ ఆయన చేసేవే అన్నమాట. అవి ఎవరికి వాళ్ళం నిర్ణయించుకోలేం కదా! అవునా” అన్నది బామ్మ.
“నిజమే బామ్మా..ఆశ్చర్యం..మేము ఎప్పుడు అసలు అలా ఆలోచించలేదు” అన్నది పావని.
“అంతే కాదు మనుషుల శరీరాల్లో ఏడు రకాల ధాతువులు ఉంటాయి. అవి రసం, రక్తం, మాసం, మజ్జ, మేధ, అస్థి, శుక్ర. వీటిని సప్త ధాతువులు అంటారు. అవి ఒకదానిని ఒకటి పోషిస్తాయి. ఉదాహరణకి..మనం తిన్న ఆహారాన్ని రసంగా మార్చి రక్తానికి అందిస్తే, అది మాంసానికి అందిస్తుంది.”
“‘రసం’ అంటే ‘ప్లాస్మా’ అన్నమాట. ప్లాస్మా అంటే అది ఒక రక్తంలో ఉండే పసుపు రంగు పదార్థం. దానితో మందులు తయారు చేస్తారు అని మీరు విన్నారా? ఈ మధ్య కోవిడ్ అనే మహమ్మారి వచ్చినప్పుడు ఈ ‘ప్లాస్మా’ తో మందు తయారు చేసి రోగికి ఇస్తే రోగం త్వరగా నయం అవుతుంది అని వార్త పత్రికల్లో చదివాం కదా!
“ ‘రక్తం’అంటే మీకందరికీ తెలుసు. అది ఎర్రగా ఉంటుంది. దానిలో మళ్లీ తెల్ల, ఎర్ర రక్త కణాలని రెండు రకాలు. మనలో ఉండే తెల్ల రక్త కణాలు రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయి. ‘మాంసం’ అంటే కండరాలు..మన ఎముకలని, నరాలను కప్పి వాటికి రక్షణగా ఉండే బలమైన పదార్థం అన్నమాట. ‘మేధ’ అంటే మన తెలివితేటలు, జ్ఞానం అన్నమాట. ‘శుక్ర’ అంటే మనిషికి మనిషి, జంతువుకి జంతువు..అలా పుడతారు కదా..అంటే పునరుత్పత్తి లక్షణం! దాన్నే ‘వీర్యం’ అంటారు.”
“ఇలా సప్త ధాతువులు వాటి పని అవి చేస్తూ సమతులంగా ఉంటేనే ఏ జీవి అయినా ఆరోగ్యంగా ఉంటుంది. వాటి నిర్వహణలో తేడా వస్తే.. దాన్ని అనారోగ్యం అంటాం. శరీరంలో మనకి తెలియకుండా అనుక్షణం ధాతువులు చేసే ఏ పనీ మనకి తెలిసి మనం పై నించీ చెయ్యం! అవునా?”
“అలాగే ఇక విశ్వంలోని వస్తే..సూర్య చంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి వాటి కక్ష్యలో అవి తిరుగుతూ తమ పని తాము చేస్తున్నాయి అంటే..అవన్నీ నిర్ణయించేవారు అంటూ ఒకరు ఉండాలి కదా! ఉదాహరణకి ఒక యంత్రం పని చెయ్యాలంటే..దాని నిర్మాణం చేసిన వ్యక్తి దానికి ఒక స్విచ్ పెట్టి, అది ఆన్ చెయ్యగానే యంత్రం నడిచే విధానం రూపొందిస్తాడు. అవునా? అలాగే ఈ విశ్వ నిర్మాణం చేసిన ఆ శ్రీమన్నారాయణుడు అవన్నీ చలించే విధానాన్ని నిర్ణయిస్తాడు.”
“అద్భుతంగా ఉంది బామ్మా..మేము సూర్యోదయం అయింది..వెలుతురు వచ్చింది, తయారై స్కూల్ కి వెళ్ళాలి. సూర్యాస్తమయం అవుతున్నది, చీకటి పడుతుంది..ఇంటికి వచ్చి చదువులు, ఆటలు ముగించి అన్నం తిని పడుకోవాలి..అని అనుకుంటాము కానీ ఇన్ని వివరాలు లోతుగా ఎప్పుడు ఆలోచించలేదు” అన్నాడు ఫణి.
“అంతే కాదర్రా..ఆయన మన ఊహకి, ప్రమాణాలకి, కొలతలకి అందని వాడు. మనిషి అంటే ఈ ప్రమాణం, చెట్టు, జంతువు అంటే ఈ ప్రమాణం..అలాగే ఏదైనా వస్తువు..ఏ ప్రమాణాల్లో ఉంటాయో మనం చూస్తున్నాం..లేదా తెలిసిన కొన్ని విషయాలతో పోల్చి చూసి ఊహిస్తాం. కానీ మనలో ఎవరం భగవంతుడిని చూడలేదు. ఎలా ఉంటాడో తెలియదు. ఆయనని మనం ఒక చైతన్య స్వరూపం ..అంటే మీరు అనుకునే ‘abstract’ గా చూసేటప్పుడు దాని రూపం కానీ, కొలత గానీ మనం ఎలా చెబుతాం? అందుకే ఆయన్ని ‘అప్రమేయుడు’ అంటారు.”
“హృషీ కేశ: అంటే..తన కిరణాలతో మన శరీర భాగాల (ఇంద్రియాలు) ద్వారా మనసులో ఆనందాన్ని కలిగించేవాడు. కళ్లతో మంచి చిత్రం చూసి, చెవులతో మధురమైన సంగీతం, మంచి మాటలు విని, నాలుకతో మధుర పదార్థాలు రుచి చూసి, చల్లని మలయ మారుతం శరీరానికి తగిలితే మనం ఆనందిస్తాం. అవునా? ఆ ఆనందం అనే భావన ఎక్కడ కలుగుతున్నది..మనసులో! అవునా అదే ‘హర్షం’ అంటే!”
“పద్మనాభోఽ మరప్రభు:” అంటే..నాభిలో పద్మం కలవాడు. ‘పద్మం’ అంటే అనేక రేకులతో వికసించి వెలుగులు విరజిమ్మేది. అంతే కాదు..తనలో పద్మం లాగా బీజాలను ఇముడ్చుకుని, పునరుత్పత్తి చెయ్యటానికి మూలం అయినవాడు అని. బ్రహ్మ దేవుడు, విష్ణు మూర్తి నాభి కమలంలో ఉంటాడు. ఆయనే కదా సృష్టి కర్త అంటే! మరి సృష్టికి కావలసిన శక్తి ఆయన నాభిలో ఉంది అనే కదా అర్థం!”
“మళ్లీ నిన్న చెప్పుకున్నట్టే ఆయనకి నశించటం, మరణించటం, అయిపోవటం అనేది ఉండదు. అందుకే ఆయన విశ్వానికి సృష్టి కర్త, నియామకుడు, పోషకుడు, ప్రభువు అన్నమాట”
“మిగిలింది రేపు చెప్పుకుందాం” అని బామ్మ వంట చేసుకోవటానికి లోపలికి వెళ్ళింది.
ఎం బిందుమాధవివినరో భాగ్యము విష్ణు కథలు:(12)

కామెంట్‌లు