కస్తూర్బా గాంధీ: - అచ్యుతుని రాజ్యశ్రీ 1వభాగం

 మనకు గాంధీజీ గురించి బాగా తెలుసు కానీ ఆయన భార్య కస్తూర్బా అనుభవించిన కష్టాలు నష్టాలు పడిన బాధలు అంతగా తెలియదు ఆమె ఒక గొప్ప ధనిక కుటుంబంలో పుట్టింది తండ్రి గోకుల్ దాస్ కపాడియా పోర్ బందర్ లో వ్యాపారి ధాన్యం బట్టలు పత్తి ఎగుమతి చేసిన మేయర్ కూడా ఆయన భార్య వ్రజ కున్వర్ బాయ్ వారికి 11 ఏప్రిల్ 1869 లో కస్తూరి పుట్టింది ఈమె అన్న పేరు కుశాల్ దాస్ తమ్ముడు మాధవ దాస్ ఇంట్లోనే హాయిగా ఆడుతూ పాడుతూ పెరిగింది కానీ చదువు మాత్రం చెప్పించలేదు ఏడేళ్ల కస్తూరికి మోహన్ దాస్ తో పెళ్లి నిశ్చితార్థం జరిగింది ఆయన కంటే ఈమె కొన్ని నెలలు పెద్దది గాంధీ కపాడియా కుటుంబాలు చిరకాల స్నేహితు లు బాల్యం నుంచి కస్తూరిబాయ్ కి ఆడపిల్లల బాధ్యతలు దైవ ప్రార్థన నేర్పారు శుభ్రత వంటలో ప్రావీణ్యం పతివ్రతగా ఉండాలని బాగా నూరి పోశారు 13వ ఏట వీరి పెళ్లి జరిగింది కస్తూ రి మంచి అందగత్తె ఉమ్మడి కుటుంబంలో ఆమె ప్రవేశించింది అత్త పుతిలీబాయి శివాలయాలు విష్ణు ఆలయాలు దర్గాకు తీసుకు వెళ్ళేది ఈమె స్వతంత్ర భావాలు కలది మోహన్ దాస్ అంటే గాంధీ బాల్యం నుంచి పిరికితనంతో భయపడేవాడు దొంగలు దెయ్యాలు పాములు చీకటి అంటే భయం. కానీ భార్య కస్తూరిబాయి మహా ధైర్యస్తురాలు ఈ విషయం గాంధీ స్వయంగా చెప్పాడు ఇద్దరూ సమవయస్కులు కానీ భర్త ఆమెని అధికారం చాలా ఇస్తూ ఇబ్బంది పెట్టాడు తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని ఆంక్ష విధించాడు కానీ కస్తూర్బా కొన్ని విషయాల్లో తెగించి ఇష్టమున్నచోటికి తోడికోళ్లతో అత్తగారితో స్నేహితుల ఇళ్ళకి వెళ్ళేది గాంధీ ఒకసారి ఆమెపై విరుచుకు పడితే ఇలా అంది మీ అమ్మ మాటను నేను ఎలా తిరస్కరించను నా తోటి కోడళ్ళు అత్తగారితో వెళ్లటం లో తప్పేంటి అని అడిగేటప్పటికీ గాంధీ మరి ఇంకా నోరెత్తలేదు ఆమెకు చదువు చెప్పాలని ప్రయత్నించాడు ఆ విషయంలో మాత్రం ఆమె నెట్లిప్తంగా ఉండిపోయింది 13 ఏళ్ల నుండి 18 ఏళ్ల వరకు ఎక్కువ కలిసి ఉండలేదు ప్రతి ఆరు నెలలకు పుట్టింటికి వెళ్ళేది మామగారు చనిపోయిన నాలుగు రోజులకి కస్తూరికి ఒక బిడ్డ పుట్టాడు కానీ మూడు నాలుగు రోజుల్లోనే ఆ శిశువు మరణించాడు ఆమెకు పుట్టెడు దుఃఖం మిగిలింది ఇక మోహన్ దాస్ కస్తూరి తో ఒకసారి బాగా దెబ్బలాడి ఆమెను శంకించి గాజులు పగలగొట్టి పుట్టింటికి తరిమేడు ఒక ఏడాది తర్వాత ఆమె భర్త దగ్గరికి వచ్చింది అనవసరంగా భార్యను అనుమానించాను అని గాంధీ రాసుకున్నాడు  బారిష్టర్ చదవడానికి గాంధీ మూడేళ్లు ఇంగ్లాండుకు వెళ్తున్నప్పుడు ఆమె బాగా దిగులు పడింది విదేశాల్లో చదువు వద్దని అల్లుడ్ని బతిమాలిన వినలేదు గాంధీ అప్పటికి కస్తూర్బా గర్భవతి తన భార్య నగలు అమ్మి బయలుదేరాలని లండన్ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు కస్తూర్బా తన పుట్టింటి వారిచ్చిన నగలన్నీ మొగుడు చేతిలో పెడితే 3 వేల రూపాయలు చేతికి వచ్చాయి వాటితో గాంధీ లండన్ ప్రయాణం సాగింది కస్తూర్బాకు ఒంటిమీద రెండు బంగారు గాజులు ఒక గొలుసు ఏనుగు దంతాలతో చేసిన రెండు ఎర్రటి గాజులు మాత్రమే మిగిలాయి అత్తగారి మాట భర్త వింటాడని ఆమెకు బాగా నమ్మకం అందుకే ఆమెకి మన్ లేదు గదిలో ఏడుస్తూ కూర్చున్న భార్యని ఓదార్చి వెళ్తున్న అన్నాడు అప్పుడు కూడా ఆమె ఏడుస్తూ వెళ్లొద్దు అంది కుల పెద్దలు వెలివే వేయటంతో పాపం కస్తూరిబా పుట్టింటికి వెళ్లే అధికారాన్ని కోల్పోయింది అత్తగారైన పుతిలి భాయ్ అడుగులకు మడుగులు ఒత్తుతూ పసిపిల్లాడితో ఉండిపోయింది అన్నకు మాత్రం గాంధీ 20 25 పేజీల లేఖలు రాసేవాడు కానీ భార్యకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు అది ఆ రోజుల్లో ఆనవాయితీ కాదు ఈమెకి చదువు కూడా రాకపోవడం ఒక కారణం🌹
కామెంట్‌లు