కస్తూరిబాయి అత్తగారు తోడికోడళ్లతో కలిసిమెలిసి బాగా ఉండేది.మను తోడికోడలు మోతీబాయి కూతురు,పెద్ద వయసులో రోగాల బారిన పడిన కస్తూరిని తల్లికన్నా మిన్నగా చూసుకుంది. మోతీ కస్తూరీ కబుర్లు 6నెలలైనా అంతంకావు, ఇద్దరినీ ఓగదిలో పెడితే అన్నంనీళ్లు లేకుండ కబుర్లతో కడుపునింపుకుంటారని అత్తగారు అనేది. పుతలీబాయి పూజ పునస్కారాల్లో మునిగితే కోడలుగా అణిగినమహిళ ఈమె.బాపూ విదేశాలనుంచి రాకముందే అత్తగారు చనిపోటంతో బాధపడింది. 1891లో బారిష్టర్ గాంధీకి కేసులు రాక ఖర్చులు పెరగటం టీ,కాఫీ,కోకోపానీయం, కోటుసూటుబూటుతో గాంధీ ఆడంబరం ఆమెను ఆందోళనలో ముంచింది. ఆమెను పాశ్చాత్య దుస్తులుధరించమని చదవమని ,చురుకు చలాకీ లేనిదని సతాయించాడు. ఇంటిఖర్చు పెరిగిందని ఆమె అంటే తాడెత్తున ఎగిరేవాడు.చేతిగాజులు పగలకొట్టి కొడుకు హరిలాల్తో పుట్టినింటికి తరిమాడు.కానీ నెల తర్వాత వచ్చి రాజ్ కోటకు తీసుకెళ్లాడు.తనొక కామపిశాచినని గాంధీ స్వయంగా రాశాడు. 300రూపాయల సంపాదన తోపాటు మణిలాల్ పుట్టడం ,దక్షిణాఫ్రికాకి ఆయన పయనంతో బేజారైంది ఆమె.ఇద్దరుకొడుకులతో ,తోడికోడళ్లతో ఉండటం కష్టం అని మొత్తుకుంది. కానీ తప్పలేదు ఎడబాటు.పైగా ఒక్క ఉత్తరంకూడా రాయలేదు.ఆమెగుజరాతీ చదవగలదు రాయగలదు.కానీ ఆయన రాయకపోటంతో కుళ్లి కుళ్లి ఏడ్చిన ఆమె ఆతర్వాత కూడా యమయాతనలు పడింది.3ఏళ్లతర్వాత వచ్చిన వాడు ఆమెను సతాయించాడు,ఐరోపా స్త్రీల లాగా గౌను బూట్లు సాక్స్ వేసుకోమని. ఆమె గోలపెట్టేది. మళ్లీ గర్భవతి ఐంది.పార్శీవనితలాగా చీరె జాకెట్స్ బూటుసాక్స్ వేసుకుంటేనే నాతో ఫారిన్ తీసుకెళ్లను అని మొండికేశాడు.
కస్తూరీబాయి- 2వభాగం:- సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి