కస్తూరీబాయి2వభాగం: -సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ

 కస్తూరిబాయి అత్తగారు తోడికోడళ్లతో కలిసిమెలిసి బాగా ఉండేది.మను తోడికోడలు మోతీబాయి కూతురు,పెద్ద వయసులో రోగాల బారిన పడిన కస్తూరిని తల్లికన్నా మిన్నగా చూసుకుంది. మోతీ కస్తూరీ కబుర్లు 6నెలలైనా అంతంకావు, ఇద్దరినీ ఓగదిలో పెడితే అన్నంనీళ్లు లేకుండ కబుర్లతో కడుపునింపుకుంటారని అత్తగారు అనేది. పుతలీబాయి పూజ పునస్కారాల్లో మునిగితే కోడలుగా అణిగినమహిళ ఈమె.బాపూ విదేశాలనుంచి రాకముందే అత్తగారు చనిపోటంతో బాధపడింది. 1891లో బారిష్టర్ గాంధీకి కేసులు రాక ఖర్చులు పెరగటం టీ,కాఫీ,కోకోపానీయం, కోటుసూటుబూటుతో గాంధీ ఆడంబరం ఆమెను ఆందోళనలో ముంచింది. ఆమెను పాశ్చాత్య దుస్తులుధరించమని చదవమని ,చురుకు చలాకీ లేనిదని సతాయించాడు. ఇంటిఖర్చు పెరిగిందని ఆమె అంటే తాడెత్తున ఎగిరేవాడు.చేతిగాజులు పగలకొట్టి కొడుకు హరిలాల్తో పుట్టినింటికి తరిమాడు.కానీ 3ఏళ్లతర్వాత వచ్చిన వాడు ఆమెను సతాయించాడు,ఐరోపా స్త్రీల లాగా గౌను బూట్లు సాక్స్ వేసుకోమని. ఆమె గోలపెట్టేది. మళ్లీ గర్భవతి ఐంది.పార్శీవనితలాగా చీరె జాకెట్స్ బూటుసాక్స్ వేసుకుంటేనే నాతో ఫారిన్ తీసుకెళ్లను అని మొండికేశాడు.కుర్లేండ్ అనే స్టీమర్లో ఇద్దరుకొడుకులు,భర్త, ఆడపడుచుకొడుకు గోకుల్ దాస్ తో పయనమైంది. వేషం పార్శీవనిత .గర్భవతి,  సముద్ర ప్రయాణం పడక నరకం అనుభవించినది.దక్షిణాఫ్రికా యాత్రచేదుఅనుభవం మిగిల్చింది.డర్బన్ లోదిగి  గుర్రపుబండీలో పార్శీ రుస్తుంజీ ఇల్లుచేరిన ఆమెకు అంతా అయోమయం!భాష ఆంగ్లం రాదు,వారు మాంసాహారులు, టేబుల్ మీల్స్ చూసిన ఆమెపని కుడితిలో పడ్డ ఎలుకైంది.పక్కాశాకాహారి వైష్ణవ సాంప్రదాయం పాటించే ఆమె పరదా పద్ధతి పాటించేది. ఆతర్వాత గాంధీ కుటుంబం రెండతస్థుల మేడలోకి మారింది.బీచ్ గ్రోవ్ విల్లా లో ఆమెనంతా*బా* అని పిల్చేవారు.అమ్మ అని అర్ధం.మేనల్లుడు10,కొడుకులు 9,5 ఏళ్ల వారు.వచ్చిన అతిథులకి వండివార్చటం బట్టలుతకటం అన్నీ ఒక్కతే చేసేది.మలమూత్రాల కుండలు అతిథులవి కూడా రోజూ కడిగి శుభ్రంగా ఉంచకపోతే మొగుడిచేతతిట్లు చివాట్లు,కొండొకచో బైటకి గెంటబడటం ఆతల్లి భరించింది. ఆరోజు విసుగెత్తి బాగా ఏడుస్తుంటే బాపూ ఆమెను గేటుబైటకి గెంటేసి గెటౌట్ అన్నాడు."నేడెక్కడకి పోవాలి" అని ఎదురుతిరిగింది."మనపరువుపోతుంది" అంది.3వకొడుకు రామదాసు పుట్టినపుడు బాలింతకు సేవచేశాడు.1900లో ఆఖరిపిల్లాడికి మంత్రసానిగా వ్యవహరించాడు ఆయన. 🌹
కామెంట్‌లు