వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
27. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపా (షోడశాక్షరీ)
28.మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా (షోడశాక్షరీ)
ఇరవైఎనిమిదవ నామ మంత్రము -
ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసాయై నమః
అవధులు లేని అమ్మ చిరునవ్వు అనబడే కాంతి ప్రవాహంలో తలమునుకలయి లయమైపోయిన పరమేశ్వరుని మనసును సొంతం చేసుకున్న పరమేశ్వరికి నమస్కారము.
జగన్మాత, త్రిపురసుందరి కదా! ప్రకృతికే అందాన్ని ఇచ్చేంత అందాన్ని కలిగివున్న జగన్మాత సౌందర్యానికి, సర్వేశ్వరుడు, తాను జగత్ప్రభువు, గంభీరంగా వుండాలని మర్చేపోయి, చాలా సాధారణమైన వ్యక్తి లాగా పులకించి పరవశం పొందుతుంటారు. ఇక, ఆ జగన్మోహిని చిరునవ్వులు ఒలకబోస్తే, ఆ అందమైన చిరు దరహాసంలో మునకలు వేస్తూ మునిగి పోతాడు, తన మనసు ఇచ్చేస్తాడు, పరమాత్మ. ఆవిధంగా, పరమాత్మ మనసును పొందిన శ్రీలలితా పరాభట్టారికను చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా" అని పిలిచి పరవశించి పోయి, అమ్మను ఆనందింపజేశారు.
పులుగు (చకోర) పక్షులు, చంద్రుని చల్లని కాంతి ప్రవాహం నుండి వస్తున్న వెలుగుల మధురిమను ఆస్వాదిస్తూ వున్నాయి. కానీ, జగజ్జననీ, ఆ చకోర పక్షులకు నీ చిరునవ్వుల ప్రవాహం నుండి వస్తున్న మాధుర్యం పరిచయమైంది. ఇంకేముంది, చంద్రుని వెన్నెలల మాధుర్యం చకోర పక్షులకు నచ్చలేదు. నీ చిరునవ్వుల మాధుర్యాన్ని తాగుతూ వున్నాయి. అయితే, ప్రతీ రోజూ నీ చిరునవ్వుల మాధుర్యాన్ని తాగుతూ ఉంటే, చకోర పక్షులకు మొహం మొత్తినట్టయి, ఒకసారి చందమామ వెన్నెల రుచి చూసి మళ్ళీ నీ చిరునవ్వుల తీపిదనం కోసమే వస్తున్నాయి. ఎలాగంటే, తేనె మాధుర్యాన్ని రుచి చూసి, జుర్రుకుని, కొంచెం కారం రుచి చూసి తేనె రుచికోసమే వచ్చే మనుషులలాగా అన్నమాట. అమ్మా! జగజ్జననీ! నీ చిరునవ్వుల మాధుర్యాన్ని ధిక్కరించే తీపి వస్తువు ఇంకొకటి ఈ చరాచర జగత్తు మొత్తంలో లేదు, కదమ్మా!
సముద్ర మథనంలో వచ్చిన గరళాన్ని, జగత్తు రక్షణ కోసం తన గళం లో దాచిన పరమేశ్వరుడు, గరళకంఠుడు అయి, ఉగ్రంగా వుండగా, అమ్మ తన చిరునవ్వుల కాంతితో, ఉగ్రహరుని శాంతింపజేసిందట. శివపార్వతుల జంట లోకకల్యాణం కోసం ఏర్పడిన ఆదర్శ జంట కదా! అమ్మ ఎలా అయితే తన చిరునవ్వుల మాయలో పరమేశ్వరుని కట్టిపడేసిందో, ఆ విద్య తమకు కూడా నేర్పించమని, తమ వైవాహిక జీవితాన్ని ఆనందమయం, సుఖమయం చేయమని అమ్మను కోరుకుంటూ, కన్యకామణులు "మంగలగౌరీ" పూజ చేస్తారు తమ వివాహ సమయంలో, పురహితుని సహకారంతో.
ఒకరి కోసం ఒకరైన పార్వతీ పరమేశ్వరులు, ఎంతో సుదీర్ఘమైన తపస్సు చేసి, బంగారు పూలతో ఒకరికోసం ఒకరు పూజచేసి, ప్రకృతీ పురుషులు అయ్యారు. ఆ తల్లి, జగన్మాత తన మందస్మిత కాంతి ప్రవాహంలో పరవశించి తనతో పరమేశ్వరుడు కలిసి వున్నప్పుడు, మన మానవుల జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మని పూజించేటప్పుడు
ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి