వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
33.కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్య (షోడశాక్షరీ)
34.నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయా (షోడశాక్షరీ)
ముప్పైమూడవ నామ మంత్రము -
ఓం నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయ్యై నమః
చెట్ల పాదు వంటి నాభి నుండి వెంట్రుకలు లత లాగా పైకి పాకగా, ఆ లతకు వచ్చిన పండ్లు లాగా కనిపిస్తున్న స్తన రత్నాలను కలిగివున్న పరమేశ్వరికి నమస్కారము.
ద్రాక్ష, దొండకాయ, వంటి తీగల విత్తనాలు భూమిలో గుంట తీసి పాతిపెట్టి, చుట్టూరా మట్టితో గోడ కట్టి, నీరు పోసి పెంచితే, కొంతకాలానికి ఆ విత్తు మొలకెత్తి, తీగలాగా పందిరి పైకి పాకినప్పుడు, లతలాగా వున్న ఆ తీగకు, ద్రాక్ష పండ్లు, దొండకాయలు ఏర్పడతాయి, చూపరుల కనులకు విందు చేస్తాయి. అలాగే, పరమేశ్వరి అయిన జగన్మాత బొడ్డు నుండి పైకి పాకిన రోమాల బారు లత లాగా సుందరంగా వుంది. కుసుమ మనోహరమైన రోమాల లతకు తగిలిన అందమైన పండ్లు లాగా కనిపిస్తున్న అమ్మ స్తన ద్వయాన్ని తమ కళ్ళతో చూచిన ఆనందంతో వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయా" అని స్తుతి చేసి తాము సంతోషపడ్డారు. ఆ సంతోషాన్ని చూసిన జగజ్జనని ఆనందాతిరేకాన్ని పొందింది.
"ఇడా పింగళ నాడులు" అమ్మ కుచములు అయితే, కుచ మధ్య భాగము "అనాహత చక్రస్తానము" అవుతుంది. నాభి నుండి ఊర్ధ్వ ముఖంగా స్తనాలవరకు వున్న రోమాల లతను "సుషుమ్నా నాడి" అనుకోవచ్చు.
శంకరుని అంతర్ముఖ శక్తి చేత దండించబడి, కాలి, బూడిద అయిన మదనుడు, ఆ వేడిని భరించలేక, అమ్మ నాభి అనే సరస్సులో మునక వేసి, ఆ తాపాన్ని చల్లార్చుకున్నాడు. అమ్మ నాభి స్థలము రతీదేవి సేదతీరుతూ వుండే విహార స్థలము. ఇక పరమేశ్వరునికి, తనకు తపసిద్ధిని ప్రసాదించే గుహ ద్వారం లాగా వుంది.
జగత్తు యొక్క తల్లివైన నీ నాభిని, లతలా పైకి పాకిన రోమాల తోరణాన్ని ఎంత కీర్తించినా మా తనివి తీరడం లేదు తల్లీ. పూల మొగ్గలు గా ఆది శంకరునిచే పూవులుగా చెప్పబడిన అమ్మ పాలిండ్ల ను, వశిన్యాది వాగ్దేవతలు ఫలములుగా వర్ణించారు.
ఈవిధంగా అత్యంత ప్రేమతో జగత్తును లాలిస్తున్న శ్రీమాతను, ఇంతటి సౌందర్యాన్ని కలిగిన లలితా పరాభట్టారికను పూజించేటప్పుడు
ఓం నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయ్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి