కస్తూర్బా 5వభాగం: -సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ

 భారత్ కి తిరిగొచ్చాక భర్త తో కల్సి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని తన సత్తా చాటింది. 3వతరగతి రైలుపెట్టెలోంచి బట్టసంచీతో దిగేవారా దంపతులు.పొట్టిగా బక్కపలచగా బంగారువన్నెలో బా  మోచేతులదాకా తెల్లచొక్కా, తెల్లంచుచీరె మేలిముసుగులోచేతికి రెండు మట్టిగాజుల్తో ఉన్న ఆమెలో దృఢత్వం సంకల్పబలం దీక్ష పట్టుదల అందరికీ ఆదర్శం.కేవలం పప్పులు పళ్లు  ఆహారంగా తినేది.3ఏళ్ల నించి అదే బాపూజీ కి కూడ అదే ఆహారం.దక్షిణాఫ్రికాలో భారతీయ స్త్రీల గౌరవ ప్రతిష్ఠలు పెంచింది.అక్కడ గృహిణులు ఉంపుడుగత్తెలుగా, కీలుబొమ్మలుగా పురుషుల దురహంకారానికి బలి అవటాన్ని ప్రతిఘటించిన ఏకైక నారి ఆమె.
ఇక భార్యగా తల్లిగా ఆమె అనుభవించిన మానసిక క్షోభ పగవాడికి కూడా  వద్దనిపిస్తుంది. తరతరాల ఆస్తిలో తన కొడుకులకు  హక్కులేకుండా భర్త రాసివ్వటంతో క్షోభించింది ఆమె హృదయం.అంటరానితనంపై ఆమె పట్టుదల మూతి బిగింపుచూసి" నాదగ్గర ఉండకు. రాజ్ కోటకు వెళ్లిపో" అని భర్త రంకెలేస్తే,"నేనెందుకు పోవాలి?  నీతోనే ఉంటా" అని గట్టిగ మొండిగ జవాబిచ్చిన ధీశాలి.
ఒకరోజు కొడుకు రామదాసు ఊరికెల్తున్నాడని భోజనం ప్యాక్ చేసి కొద్దిగా ఆలస్యంగా ఆశ్రమానికొచ్చిందని బాపూ ఛడామడా తిడితే, " ఎందుకు నాపై విరుచుకు పడతావు? పిల్లల బాగోగులు పట్టించుకోవు" అని నిగ్గదీసి భర్త ని ఇరకాటంలో పెట్టింది.
అతి కష్టమైన కట్టెల పొయ్యిపై గుండిగతో వంటచేసేప్పుడు పొగతో ఉక్కిరిబిక్కిరవుతూ కూడా,వచ్చినవారికందరికీ తనే స్వయంగా వడ్డించిన అన్నపూర్ణ కస్తూర్బా.చంపారన్ లో వీధులూడ్చి  బడినిర్మాణంలో ఇటుకలు రాళ్లు మోసింది బా.ఆమె ఆస్తి ఓపరుపు, చిన్న పెట్టె.సాబర్మతీ ఆశ్రమంలో  అతికష్టంమీద భార్యకు కాఫీ తాగడానికి అనుమతించాడు గాంధీ.నెహ్రూ కి చాయ్,రాజాజీకి కాఫీ గుర్తుపెట్టుకుని ఇచ్చేది.బాపూ ఏదో అనబోతే " వారిపై మీకు పెత్తనం చేసే హక్కులేదు" అని గట్టిగా ధైర్యంగా నోరెత్తకుండా చేసినభార్యామణి. "ప్రతి ఆదివారంసుష్ఠుగా నాకు పురమాయించి మెక్కలేదా మీరు? రకరకాల వంటకాలు వార్చలేదా నేను??!!" ఆమె దెప్పుళ్లతో కిక్కురుమనేవాడు కాదు.🌷
కామెంట్‌లు