వచ్చే 5 న మార్చ్ టు పార్లమెంట్ కొరకు ఛలో డిల్లీ

 ఏ ఐ పి టి ఎఫ్, పి టి ఏ తెలంగాణ పిలుపు..
దేశ వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల కలయిక వల్ల ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ (ఎ ఐ జాక్టో) ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎ ఐ జాక్టో టెట్ నుండి సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ  మొదలైన డిమాండ్ ల తో ఫిబ్రవరి 5 తేదీన ఢిల్లీ యందు "మార్చ్ టు పార్లమెంట్ "కు పిలుపు ఇవ్వడం జరిగింది. కావున మన రాష్ట్రం లో నుండి భారీ స్థాయిలో ఉపాద్యాయ లోకం ఈ మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమం నకు హాజరు కావాలని ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి వైయస్ శర్మ,తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె . శారద, ఏఐపిటిఎఫ్ జాతీయ కౌన్సిలర్లు డి. నగేష్, పి.విక్రమ్ బాబు లు  కోరారు. నేడు ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ (ఎ ఐ పి టి ఎఫ్) ఆధర్వ్యం లో అన్ని రాష్ట్రాల ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్లు అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లతొ ఎ ఐ పి టి ఎఫ్ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు బసవ రాజు గురీకర్, కమలకాంత త్రిపాఠి నేటి జాతీయ ,అన్ని రాష్ట్రాల అనుబంధ సంఘాలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించి మార్చ్ టు పార్లమెంట్ పై దిశానిర్దేశం చేసారు.
మన  రాష్ట్రంలో ఉన్న యు టి ఎఫ్, ఎస్టియు , పిటిఎ తెలంగాణ, సంఘాలు ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ లో భాగస్వామ్యంగా ఉన్నాయి కాబట్టి అన్ని జిల్లాల యందు ఈ సంఘాల సభ్యులు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల నుంచి భారీ స్థాయిలో ఉపాద్యాయులు ఫిబ్రవరి 5 న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే మార్చ్ టు పార్లమెంట్  ఆందోళన కార్యక్రమన్ని విజయవంతం చేయాలని ఏఐపిటిఎఫ్ జాతీయ కార్యదర్శి వై యస్ శర్మ, తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె .మల్లికార్జునరెడ్డి, కె .శారద, ఏఐపిటిఎఫ్ జాతీయ కౌన్సిలర్లు డి. నగేష్ , పి.విక్రమ్ బాబు నేడొక  పత్రికా ప్రకటనలో కోరారు
కామెంట్‌లు