పెద్ద కొడుకు హరిలాల్ 5గురు పిల్లల తండ్రి ఐనా దుర్వ్యసనాలతో తాగుడు తందనాలతో పాటు సానికొంపలకు వెళ్లడం ఆతల్లిని బాధించింది. పైగా కోడలు చనిపోటంతో 4గురు మనవల పెంపకంలో ఆమె పాట్లు దైవానికే ఎరుక!భర్తను మాత్రం ఆరోగ్యంకోసం మేకపాలు తాగమని వేరుసెనగపప్పుతో సహా అంతా సిద్ధం చేసేది.మోటుగా బరువుగా ఖద్దరు చీర తాను కట్టలేనని బా మొత్తుకున్నా ససేమిరా అన్నాడా మహానుభావుడు.పాపం రాజీ పడింది .తన కాలివేళ్లకు దెబ్బతగిలితే ఖద్దరు బ్యాండేజీనే కట్టుకుందామె.సాబర్మతీ ఆశ్రమ మహిళలు బట్టలుతికే సబ్బు ఒకటి సరిపోదని గొడవ పడితే,బాపూని మెప్పించి ఒప్పించి సబ్బురేషన్ ని పెంచింది.
కస్తూర్బా సుఖపడింది తక్కువ, భర్త తో గతుకులబాటపై పయనం ఆమె జీవితం.ఆమెను బాగా బాధించిన విషయం,స్త్రీ సహజం.అదేమిటో తెలుసా!? విద్యావంతులైన ఫ్యాషన్ భామలతో భర్త సరదాగా నవ్వుతూ మాట్లాడటం.ముఖ్యంగా సరళాదేవి అనే ఆమెతో చాల ఇబ్బందులు మానసిక క్షోభ అనుభవించిందా అమాయక ఇల్లాలు.ఠాగూర్ మేనకోడలు,కవిత్వంతో పాటు పాటలు పాడి గాంధీని ఆకట్టుకుంది.జనాలు ఆయన్ని బాపూజీ అని ,ఆమెను మాతాజీ అని చుట్టుముడితే ఎవరికైనా ఒళ్లు మండదూ!? అదే జరిగింది కస్తూరి విషయంలో! సాబర్మతీ ఆశ్రమంలో సరళతో కబుర్లతో ఆయన హస్క్ వేస్తూ అన్నం తినేటైం దాటినా,పాపం తను తినకుండా అలాగే ఆయన కోసం కాచుకుకూచుని పొట్ట మాడ్చుకున్న రోజులెన్నో! వండి వార్చి వడ్డించే డ్యూటీ ఆమెదే మరి!ఆమె పతిభక్తిని సుశీలానయ్యర్ తల్లి తెగ పొగిడింది. ఇక ఆశ్రమవాసుల కీచులాటలు బా కు తలనెప్పిగా మారాయి.భర్త పర్యటనలో ఉన్నప్పుడు ఆయన వెంట ఉండి టైంకి మేకపాలు,పండ్లు,డ్రైఫ్రూట్స్ గింజలు ఇచ్చేది.ఉడకబెట్టిన కూరగాయలు రొట్టెలు వేడిగా అందించేది. 1921లోబీహార్ లో సహాయ నిరాకరణ కి నిధులు సేకరిస్తున్నపుడు, గుజరాతీ స్త్రీలు ఆమెకు నెక్లెస్ బంగారుమురుగులు బహుమతులుగా ఇస్తే వాటిని తిరస్కరించింది.ఆమెలో స్వార్ధచింతన ఇప్పుడసలు లేనేలేదు.కాగితంలో చుట్టిన ఆహారాన్ని ఆమె ఈసడించేది.విజయలక్ష్మి పండిట్ కోసం ఆమె స్వయంగా వడికిన నూలు చీరను ఇస్తే,నవవధువు దాన్ని ధరించింది. రోజూ గంటసేపు నూలు వడికేది.భర్త కాళ్లకు నూనెరాసి మర్దన చేసేది🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి