ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. వాటిలో మేకలు ఎలుకలు కూడా ఉండేవి. మేకలు పెద్దగా ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం గర్వం ఎక్కువగా ఉండేది.
ఒకరోజు ఎలుక రాజు దారిలో పోతుండగా ఒక మేక ఎదురయింది. దానితో మేకా ....మేకా .. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ అడిగింది. అప్పుడు మేక నీవు ఇంత చిన్నదానివి నన్ను ప్రశ్నిస్తావా! నన్ను అడుగుతావా! నేను చాలా గొప్పదానిని చూడు నేను ఎంత పెద్దగా ఉన్నాను అని గర్వంగా అన్నది. ఇప్పుడు ఎలక రాజు ఏమి అనకుండా వెళ్లిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మేకలు పాకలో కట్టేయబడి ఉన్నాయి. వాటిని తినడానికి ఒక పులి రాజు వచ్చింది. మేకలు పారిపోవడానికి వీలు కాలేదు. ఇంతలో ఎలుక రాజు అక్కడికి అనుకోకుండా వచ్చింది. పులిని చూసింది. ఈ మేకలను ఎలా కాపాడాలి అని ఆలోచించింది. వెంటనే అక్కడకు వచ్చి వాటి తాళను పళ్ళతో కొరికి తెంపేసింది. అంతే మేకలు అటు ఇటు ఉరికి తప్పించుకున్నాయి. తర్వాత ఎలక రాజు చేసిన సహాయానికి మేకరాజు కృతజ్ఞతలు చెప్పి , నిన్ను నేను ఒక సారి అవమానించాను, నన్ను నువ్వు క్షమించాలి అని బతిమాలింది. అప్పుడు ఎలుక అదేమొద్దులే, మనం అందరం అడవిలో ఉండే జంతువులం. ఒకరికొకరo సాయం చేసుకోవాలి అన్నది. తరవాత ఎవరి దారి అవి పోయినాయి .
నీతి :- మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి