కస్తూర్బా- 7వభాగం:-అచ్యుతునిరాజ్యశ్రీ

 బాపూజీ ఎరవాడ జైల్లో ఉన్నప్పుడు బా యంగ్ ఇండియా పత్రికలో ఇలా ప్రకటించింది" నాభర్తకు 6ఏళ్ల జైలుశిక్ష వేశారు.నేనుగుండెదిటవు చేసుకున్నాను.మీరంతా ఖద్దరు ధరించండి. నూలు వడకండి.విదేశీవస్త్రాలు కొనటం అమ్మటం మానండి. " చాలా చురుగ్గా వాడవాడలా తిరిగి ఉపన్యాసాలిచ్చింది.అజ్మీర్ లో రాజకీయ సభల్లో మాట్లాడి సత్తా చాటింది. మార్వాడీల్ని ఖద్ధర్ ధరించమని కోరింది.రక్తహీనతతో బాధపడ్తూకూడా బోర్సాద్ ప్రాంతంలో పోలీసులు లాఠీఝళిపించటంతో, మిథూబెన్ తో కల్సి రైలులో వెళ్లి పరిస్థితులను అవగాహన చేసుకుంది.100పల్లెల్లో ఖాదీప్రచారం ముమ్మరంగా చేసింది.ఆంగ్ల ప్రభుత్వం దిగివచ్చింది. సాబర్మతీఆశ్రమంలో 20మంది పెద్దలతో పాటు కొందరుపిల్లలకు ఆమె వండి స్వయంగా వడ్డించేది.🌷
కామెంట్‌లు