అనగనగా ఒక ఊరు ఉండేది . ఆ ఊరిలో ఒక పిల్లవాడు ఉండేవాడు. అతని పేరు శ్రీను ఒక రోజు శ్రీను వాళ్ళ నాన్న పొలంలో జారి కింద పడుతాడు. పక్క పొలంలో ఉన్న ఒక వ్యక్తి అతన్ని చూసి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి అతన్ని శ్రీనుకి అప్పజెప్తాడు . కొన్ని రోజులు తర్వాత శ్రీనుని వాళ్ళ నాన్న పొలం చూసిరమ్మని చెపుతాడు. శ్రీనుకి పొలానికి వెళ్ళేటప్పుడు దారిలో అతనికి బంగారం దొరుకుతుంది .బంగారాన్ని తీసుకొని పొలాన్ని చూడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు శ్రీనుకి బంగారం దొరికింది. అని వాళ్ళ నాన్నకు చెప్పకుండా ఇంట్లో దాచిపెడుతాడు • వాళ్ళ నాన్న పొలం ఎట్లా ఉంది? అని అడుగుతాడు . అప్పుడు శ్రీను నాన్న పొలం బాగానే ఉంది అని చెప్తాడు. కొన్నిరోజులు తర్వాత శ్రీను వాళ్ళ నాన్నకు గాయాలు నయమైపోతాయి. ఆ తర్వాత వాళ్ళ నాన్న పొలాన్ని చూడడానికి వెళ్ళాడు. అప్పుడుఆ పొలం ఎండిపోయి పంటంత నేల పాలౌతుంది . అది చూసి వాళ్ళ నాన్న చాలా బాధపడుతాడు. కాని శ్రీను వాళ్ళ నాన్నకు తెలియకుండా బంగారం తీసుకొని బంగారు దుకాణం కి వెళ్తాడు. కాని దుకాణం మూసి ఉంటుంది. అప్పడు శ్రీను బంగారాన్ని తీసుకొని అడవిలో దాచిపెడతాడు . దాచి పెట్టేటప్పుడు అడవిలో దొంగలు దాన్ని చూస్తారు.శ్రీను వెళ్ళిపోయిన తర్వాత దొంగలు ఆ బంగారాన్ని దొంగతనం చేస్తారు. మరుసటి రోజు శ్రీను ఆ బంగారాన్ని తీసుకొని అమ్మాలనుకుంటాడు. దాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బంగారం ఉండదు. అది శ్రీను చూసి చాలా బాధపడతాడు.
నీతి:-
అత్యాశకు పోయి ఒకటి దొరికిందని ఆశపడితే ఉన్నది పోయితుంది ఉంచుకున్నది. పోతుంది.
నీతి:-
అత్యాశకు పోయి ఒకటి దొరికిందని ఆశపడితే ఉన్నది పోయితుంది ఉంచుకున్నది. పోతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి