సంక్రాంతి : - డి. వినాయకరావు భైన్సా - 9059494259
కం:పండుగ సంక్రాంతమరున్ 
చండాంశువు మకరమందు సంక్రమణొందన్ 
నిండగు సంస్కృతి తెలుపున్ ,
నండగ తానుండి జనుల హ్లాదము బంచున్ 

కం:భోగీ మంటలనందున్ 
మోఘంబగు వస్తువులను ముట్టించుదురున్ 
భోగము నిచ్చెడి వేడక 
భాగములనుయిచ్చి జనుల బాధలుతీర్చున్ 

కం.రంగుల ముగ్గులు చూడవి 
ముంగిట్లో ముద్దు గొల్పు ముద్దియలేయన్ 
అంగనమాకర్షించును 
అంగనముల రంగవల్లి నద్భుతముండన్ 


కం: చకినాల చవిని చూపన్
చకచక తినుమంటు జనుల స్వాగత మిచ్చున్ 
వికసింపజేయు లడ్డుల్ 
ముఖముల్ రుచిచూడ గుడము ముద్దలొ తిలలున్

కామెంట్‌లు