పక్షి: - మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
మనల్ని మేల్కొలిపే కిలకిలా రవాలు కనుమరుగై పోతున్నాయి

చెట్టులో తన గూడును నిర్మించుకుని
సందడి చేసే పక్షులు చెట్లతో పాటు
కనుమరుగై పోతున్నాయి

కాలానికనుగుణంగా
సుమధురంగా తమ గాత్రాలతో మనల్ని
మంత్ర ముగ్ధలను చేసే పక్షులు వాయుకాలుష్యంతో
కనుమరుగై పోతున్నాయి

ప్రకృతి రమణీయతలకు
చిరునామా పక్షులు అని మరచిపోతున్నాము

నవీన నాగరికత పేరుతో  కృత్రిమ చెట్టును పూలను
చూడవలసి వస్తున్నదని మరచిపోతున్నాము

పర్యావరణ సమతుల్యతను కాపాడే పక్షులను
కాపాడుకోవాల్సిన బాద్యత మన అందరిపై ఉన్నది. 
జాతీయ పక్షుల దినోత్సవ శుభాకాంక్షలు Jan 05
=============================
మంజుల పత్తిపాటి-  చరవాణి 9347042218
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం


కామెంట్‌లు