1.
అక్టోబర్ 2,
భరతమాత నోముల ఫలం!
ఇద్దరు ప్రసిద్ధ నే నేతలు ,
ఈ భూమిపై జననం!
ఒకరు గాంధీజీ స్వాతంత్ర, పోరాట నేతృత్వ సమర్ధత !
మరొకరు శాస్త్రీజీ ,భారత, ప్రజాస్వామ్య పారదర్శకత!
శాస్త్రీజీ స్మరణం యువత, భవితకు ప్రేరణ ప్రదాత!
2.
రూపంలో వామనుడు ,
విధి నిర్వహణ త్రివిక్రముడు!
భారతదేశస్వాతంత్రోద్యమాన, ప్రముఖుడు!
గాంధీ నెహ్రూల నమ్మకం, చూరగొన్న అనుచరుడు!
స్వతంత్ర భారతాన,
రైల్వే మంత్రి, హోంమంత్రి!
తరువాత దేశానికి,
(అ)ద్వితీయ ప్రధానమంత్రి!
ఉన్న కాలం స్వల్పం, పనిచేసిన తీరు అమోఘం!
పాకిస్తాన్ యుద్ధం ఆయన, నైపుణ్యం అనన్యం!
జై జవాన్ !జై కిసాన్ !,
ఆయన నినాదం!
ఒకరు పోషణ,మరొకరు రక్షణ, దేశానికి ఇద్దరు రెండు కళ్ళు!
నేటికీ ఆ నినాదం,
దేశ వికాస, మహా మంత్రం!
3.
నైతిక బాధ్యతగా పదవీ, త్యాగం అది ఆయన ఆదర్శం!
అంకిత భావంతో మెరిసే,
ఎర్రని ఎరుపు లాల్!
జీవితమంతా విధినిర్వహణ, ధైర్యవంతుడు (బహదూర్)
ఇంటి పేరు, సంస్కృత,
విద్యాభ్యాసం శాస్త్రి!
వెరసి ఆయన మనకు,
లాల్ బహదూర్ శాస్త్రి!
4.
ఆయన కీర్తి కేతనాలు,
ఎన్నో స్మృతి చిహ్నాలు!
తాష్ కెంట్ లో ఒక వీధి, వారణాసి విమానాశ్రయం!
హైదరాబాద్ ఆటల మైదానం ముస్సోరిఅకాడమీ,నామాలు!
మరణాంతర, మొదటి,
భారతరత్న గౌరవం!
మానవతావాది దర్శనం విజయఘాట్ సందర్శనం!
______'__
నేడు, జనవరి, 11.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి