జనవరి 12, జాతీయ యువ దినోత్సవం.
=============================
1.
దేశ ప్రగతి దేశ యువత ,
సరి పాత్రే కీలకము!
వారి నైపుణ్యాల ,
దేశం దినదిన ప్రవర్ధమానము!
అలుపెరుగని శ్రమే ,
సమస్య సాధన ఆయుధము!
వారి శరీర మనోవికాసం ,
దేశ ఆయువర్ధనము!
దేశ జనాభా అధిక శాతం, యువతే తెచ్చు నవతే!
2..
యువతా! విశ్రమించకు,
నిర్దేశ లక్ష్యం చేరేవరకు!
పోరాటం విరమించకు,
వచ్చే వత్తిళ్ళ తలవంచకు!
గెలిస్తే లక్ష్యసిద్ధి మరణిస్తే, యశోదేహం బతుకు!
మందలో ఒకడిగా కాక,,
వందలో ఒకడై పలుకు!
కెరటం చూడు లేచి పడు,
పడి లేచు, నడుముందుకు!
3..
యువతా! నీవు దైవాంశ,
జ్ఞానాన నీవే పరమహంస!
క్షుద్రం హృదయ దౌర్బల్యం శౌర్యంకవచం వద్దు మీమాంస!
అభ్యుదయం శాంతి పథం, చేపట్టాలి ఆయుధం అహింస!
నీది సత్యాగ్రహం ఆపలేదు,
ఏ గ్రహం, తథ్యం ప్రశంస!
ప్రతిదినం యువతఉత్సాహం, సర్వజనం నీరాజనం!
4.
యువకులు మగత వీడితే, పంజా విసిరే పులులు!
సత్తువ చూపితే సృష్టిస్తారు, విశ్వాన ప్రభంజనాలు!
ఆకర్షణ అధిగమిస్తే,
చుట్టొస్తారు అంతరిక్షాలు!
ఏకాగ్రత ఆవహిస్తే,
సొంతమే అనంత విజయాలు!
దేశ నుదుటి వ్రాత విధాతలు, యువతి యువకులే!
5.
యువతా! నీవే భరతమాత, శ్వాస ,నీపై నమ్మకము!
నీ ధ్యానమే, దేశ భావియోగం, సంకల్పమే సంక్షేమము!
శీలమే సర్వస్వం, వ్యక్తిగత, వికాసమే దరహాసము!
పిరికితనం మరణం
ధైర్యమే జీవితము నిజము!
మీరు పదండి ముందుకు, దేశం కోసం బతికేటందుకు!
_________
యువతే ఘనత! నవతే భవిత!: - డా పివిఎల్ సుబ్బారావు--9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి