:ప్రత్యక్ష దేవత.: - డా పివిఎల్ సుబ్బారావు. -విజయనగరం.9441058797.
 1.
 మాత ,భూమాత ,
               శ్రీ మాత, గోమాత! 
గోవు జంతువు కానే కాదు ,
        కళ్ళ ముందున్న దేవత!
గోవు తనశరీర ప్రతి,
భాగంలోను మహిమాన్విత!
గో దర్శనం ,ప్రదక్షిణం,
         అర్చన, అతి విశిష్టత! 
గోమూత్రం, గోమలం,    
          వినియోగాన పవిత్రత!
2.
సంపద అంటే పాడిపంట!
 పాడికి మూలం గోవేనంట! 
పాలు, పెరుగు ,వెన్న,,
 ప్రతి ఇంటా ఉండాలంట!
శ్రీకృష్ణుడు గోపాలకుడు,
                     అయ్యేనంట !
యదుకులం గోకులమై,
                     నిలిచేనంట!
3.
ఆవున్న గృహం,
           ఇల  లక్ష్మీనివాసం!
ఆవు పాలు,
      ప్రథమ పంచామృతం! 
ఆవుపాల జున్ను, కోవా, పాయసం తీపి నిర్వచనం!
గో సేవ మనకి ,
తెరుచు జీవన మోక్ష ద్వారం! 
గోదానం ఒక్కటితో, 
మానవ సర్వపాప హరణం!
4.
  ఆవు కొవ్వు వాడిన,
      ఆనాటి తుపాకీ తూటా! 
నాటి సిపాయిలు చేసిన , తిరుగుబాటు మూలమంటా!
స్వాతంత్ర్య సమరానికి ,
          వేసింది రాజబాట! 
పడింది బ్రిటీష్ ,
   సామ్రాజ్య కోటకి పెద్ధ బీట! 
గో శక్తికి ఇదే ,
చారిత్రాత్మక సాక్ష్యమంట!
5.
  గోవుల్ని ప్రేమిద్దాం! 
   గోవుల్ని పూజిద్దాం! 
   గోవులతో కలిసి జీవిద్దాం! 
   గోవుల సంపద పెంచుదాం !
   ఒకటై గోవధ నిషేధిద్దాం! 
==========================

కనుమ పండుగ శుభాకాంక్షలు

==========================

కామెంట్‌లు