మకర సంక్రాంతి ! మరకత కాంతి!: - డా పివిఎల్ మబ్బారావు -విజయనగరం.-9441058797.
నా పంచపదుల సంఖ్య---
                  2150-2151

2151.
పండగ మధ్యమ సంక్రాంతి, జనజీవన కంటికాంతి!

ఏడాదంతా రైతు క్రాంతి ,
నిండెగాదెల ఐశ్వర్య కాంతి!

ముంగిళ్ళలో రమణీయ, రంగవల్లుల రంగుల కాంతి!

నిండ గొబ్బెమ్మలు గోపికలై, మెరిసే సౌందర్య కాంతి! 

హరిదాసు, గంగిరెద్దు, బుడబుక్కలవాడు సంస్కృతి,
పివిఎల్!

2152.
ధరణి పల్లెలు సాలిగ్రామాలు, రాగాల రేపల్లెలు! 

గృహాలు ఆనంద సీమలు,
 పాడిపంట స్వర్గసీమలు! 

ప్రీతిగ నవ్వుల మాటలు, నోరూరించే పిండి వంటలు!

ఇంట చతుర్ముఖ పారాయణం, బయట కోడిపందాలు!

భూమిగుండ్రమే నీవెక్కడున్నా,
గ్రామం నిన్ను పిలుస్తుంది, 
పివిఎల్! 
________


కామెంట్‌లు