సమర్ కహాని! అమర్ సేనాని!: - డా. పివిఎల్ సుబ్బారావు. విజయనగరం. 9441058797.

సుభాష్ చంద్రబోస్ జయంతి,


1.
ఇలయోధులు యశోదేహులు,  ఎన్నడూ మరణించరు!

విప్లవాలు ముగియవు,
 జనం ఆ దారి నడుస్తుంటారు! 

యోధుల నేత నేతాజీ, దేశీయులు నిత్యం స్మరిస్తారు!

సుభాష్ చంద్ర బోస్ పోరాటాల బిగ్ బాస్ అంటారు 

దేశమాత నోముల పంట, జైహింద్ మోగే గుడి గంట!

2.
అహింసా వాదం పొసగదు, పోరుబాట పట్టిన వాడు! 

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, పార్టీ తాను స్థాపించాడు! 

పలుమార్లు జైలు నిర్బంధం భా.జా.సై. సమీకరించాడు! 

ఆజాద్ హింద్ ప్రభుత్వం సింగపూర్ లో ఏర్పరిచాడు!

బోస్ మరణం రహస్యం అజ్ఞాతం వెళ్ళాడని నమ్మకం! 

(భా.జా.సై. వివరణ---
I.N.A. Indian National Arrmy.
భా.జా.సై.
 భారత జాతీయ సైన్యం)

3.
అతివాది /మితవాది ,
         ఆ దేశభక్తి పరసువేది!

భారత స్వాతంత్ర సమరం,   
      జాతికి ఉత్ప్రేరకమది!

నేతాజీ దేశభక్తి ,
తరతరాలకు ఆదర్శమది!

నేతలకు నేత నేతాజీ, 
మరో శివాజీ రూపమది! 

జయంతి /వర్ధంతి స్మరణం, 
పునీత గంగా స్నానమది!

నేతాజీకీర్హి,
             హిమాలయము,
   నాయకత్వస్ఫూర్తి ,
                అజరామరము!
_________

కామెంట్‌లు