యుగానికి ఒక్కడు: - డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం, 9441058797.
నా పంచపదుల సంఖ్య---
       2162_2166.

2162.
ఆ వ్యక్తి శిరసెత్తి నిజ, ఆత్మశక్తిగా నిలిచాడు! 

దమన ఆయుధ శక్తి, నిర్వీర్యమవ్వగా గెలిచాడు!  

మోహన్ దాస్,  ,
       నీతినియమాల,
          నిత్యసత్యవ్రతుడు!

కరం జీవిగా,
     మచ్చలేని,పున్నమి ,
       చంద్ శోభితుడు?

గాంధీ గా జన హృదయ, సువర్ణ సింహాసనాదీశుడు, పివిఎల్!
2163.
బాధకి లొంగని ధ్యానము,
లక్ష్యాన్ని  మరువని మౌనం!

జాతిని వెన్ను తట్టే ఆ చూపు, బాపుని స్మరిస్తే మనం!

ఓ మహాశక్తి సాక్షాత్కారం,
సరి పరిష్కార సాధనం! 

భారతీయుల నడిపించిన నాయకత్వ నిర్వచనం! 

దేశ స్వాతంత్ర సమర నేత, జన స్వాతంత్ర విధాత, 
పినిఎల్!
2164.
వ్యక్తిత్వ వికాసం మనో, చైతన్యమే ఆయన మార్గము! 

మతాలకందని,
      దైవవిశ్వాసము  ,
             ఆయనసొంతము! 

ఈశ్వర్ అల్లా తేరే నామ్, ఆయన ప్రార్థన గీతము! 

సత్య అహింసల నవ్య, సవ్యసాచి విజయరథము!

అది తరతరాల జగాన ,
నిలిచే ధర్మ పథము, పివిఎల్!
2165.
సబ్ కో  సమ్మతి దే భగవాన్,
మానవత మూలము! 

లక్ష్యసాధన అనుసరించే, తీరు అతి ప్రధానము! 

మహాత్ముడు కలియుగాన, నడిచిన అవతారము!

శాఖాహారం మహాసత్వము సత్యభాషణం వ్యక్తిత్వము!

కరెన్సీ పైన ఆయన చిత్రం ,
ట్రాన్స్పరెన్సి చిహ్నము, 
పివిఎల్!
2166.
చివరి క్షణం అమ్మా,
      అనక రామా ,
         అన్న జీవితము! 

జీవాత్మ ఆ పరమాత్మలో, కలిసిందనే సంకేతము!

ఆయన జయంతి ప్రపంచాన, అహింసా దినోత్సవము! 

వర్ధంతి మన మృతవీరుల స్మారక దినోత్సవము!

ఆ కర్మయోగి చరణ స్పర్శ ,
ఈ ధరణి పునీతము,
పివిఎల్!
_________


కామెంట్‌లు