భూలోక నారదుడు. (షట్పంచ పదుల ప్రస్తుతి): - డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం, 9441058797
నా పంచపదుల సంఖ్య---
     2140-2145.

2140.

తండ్రి రామబ్రహ్మం ,రాముడే, 
అతడి జీవన సర్వము! 

కన్నతల్లి సీతమ్మ ,సీతమ్మ, అనుగ్రహం సంపూర్ణము! 

తాత గిరిరాజ కవి అదే, వాగ్గేయ వారసత్వము! 

శొంఠి వేంకటరమణయ్య, గురువుగా శిష్యరికము!

సంగీత త్రిమూర్తుల స్ఫూర్తి, కర్నాటక సంగీత దీప్తి ,
పివిఎల్! 

2141.
ఆయనకొచ్చిన ఆస్తి ,
విగ్రహాల రూపాన దైవాలు!

నిరతము భక్తి ,పూజించిన, ఆయన మనోభావాలు! 

అనుదినం ఊంచవృత్తి,,
గడచిన జీవన దినాలు!

సమయమంతా శ్రీరాముని పై, కృతులుగా రచనలు! 

సామాన్య జీవనం అనన్య, ఉదాహరణమే త్యాగయ్య, 
పివిఎల్!

2142.
సంగీత రాగతాళాల, ప్రావీణ్యమ కాదు ఆశయము!

భగవన్నామాలు పలకడం,
ఆ లీలలు కీర్తనము! 

సంగీతమొక సాధనము,
 అదే ఆయన జీవనము!

సంగీతజ్ఞులకు ఆయనే,
 ఓ సంగీత అవతారము! 

సంగీతానపంచామృతాలుపంచరత్నాలుశాశ్వతము
పివిఎల్!
2143.
తొంబదిఆరుకోట్ల రామనామ, జపమే ఓ తపము!

స్వీయనుభవమే కృతులుగా, మలచడమే లక్ష్యము!

గాంధర్వగానమే,    
      మధురానుభూతై,
            లోకాన సాక్ష్యము!

స్వరార్ణవం ,నారదీయము ,
నారద మంత్రోపదేశము!

దివ్యనామ ఉత్సవ, సాంప్రదాయ కీర్తనలు లభ్యము, పివిఎల్!

2144.
నిధి కాదు రాముని సన్నిధి, సుఖమని  నమ్మినాడు!

నూట ఎనిమిది నామాలతో, రామస్తుతి చేసినాడు!

జగదానందకారక,
 పరవశించి పాడుకున్నాడు!

నన్ను ఏ దొర,
కొడుకు బ్రోచునో, 
     ప్రాధేయ పడినాడు!

ఎందరో మహానుభావులు మహానుభావుడే త్యాగయ్య,
పివిఎల్!

2145.

ఆయన జన్మదినం భారతీయ సంగీతోత్సవము! 

ప్రతి సంవత్సర తిరువయ్యార్, ఆరాధనోత్సవము!

సంగీతజ్ఞులు ఒకచోట ,
తమ విద్యా ప్రదర్శనము! 

శ్రోతలందరికీ మరి ,
శ్రవణానంద నాద సుఖము!

 బెంగుళూరు నాగరత్నం గారి, 
అర్థమంతా సార్ధకము, 
 పివిఎల్!
_________
.

కామెంట్‌లు