యశోదేహులు.: - డా పివిఎల్ సుబ్బారావు,-9442058797.

అమరవీరుల సంస్మరణ దినం,
(మహాత్మా గాంధీ వర్ధంతి) 
========================
నా పంచపదుల సంఖ్య---
      1606-1607.

1607.
వీరులంతా బతికేది, అహర్నిశలు దేశం కోసమే! 

వనాలు ,గిరులు ,ఎడారులు, 
ఏవి కాదు ఆటంకమే!

త్రాచుల్లా రేచుల్లా ముందుకు, మరి దూసుకు పోవడమే!

దేశరక్షణే కర్తవ్యం ,
అన్యచింతనలన్నీ శూన్యమే!

నిత్యమూ రణం ,,ప్రాణమే, పణం, సమర్పణ ఉత్సాహమే,
పివిఎల్!

1607.
యుద్ధం లేకున్నా పౌరులకు, సరి సేవలుందించడమే!

వరదల వేళ రంగాన దిగి, చేయూత నివ్వడమే! 

శాంతి భద్రతలు లోపిస్తే, పరిస్థితి చక్కబెట్టడమే! 

త్రిదళాల సైనికులు,
సేవా భావానికి దర్పణమే!

దేశమాత పుణ్యం సైన్యం ,
కన్న అమ్మానాన్న జన్మ ధన్యం, పివిఎల్! 
_________

కామెంట్‌లు