జీవకోటి ప్రపంచం !:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
ప్రపంచం ఈ ప్రపంచం
విశాలమైనది ప్రపంచం
సమస్త జీవరాసులకును
నిలయం ఓ దేవాలయం!

ప్రపంచం  ప్రపంచం
నడుస్తున్న ప్రపంచం
ఆరా తీస్తే తీరా చూస్తే
నేరమయం ప్రపంచం !

నేరమయమైన ఈ ప్రపంచాన్ని
దర్శించి హర్షించలేక జీవులన్ని
బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నవి
నక్కి నక్కి అవన్ని నివసిస్తున్నవి !

అందంగా ఆనందంగా
జీవిస్తున్న ఈ జీవులకు
ఈ నేర ప్రపంచమందు
వాటికి లేదు ఏ పొందు !

జరుగుతున్న దోపిడీల
పెరుగుతున్న రాపిడీల
యందు చిక్కే జీవులు
తప్పెను వాటి తావులు !

వాటి ఆశ పాశం విడిపోయే
కోటి ఆశల సౌధం పడిపోయే
లేదిక వాటికిక దిక్కు దివానం
వేదిక ఎక్కి చేసినవి ప్రమాణం !

వాటిని రక్షించేటి సంరక్షించేటి
శాంతి ప్రశాంతమైన ప్రపంచం
వాటికోసం ఆవిష్కరించబడాలి
సమస్యలు పరిష్కరించ బడాలి !


కామెంట్‌లు