ప్రేమే దైవం: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
నయాగార జలపాతము నందు
వయ్యారంతో నువ్వు చేసే విందు
పంచుకుందామా నా ప్రియభామ
పెంచుకుందామా ఇక మన ప్రేమ !

 గల గల పారేటి సెలయేళ్లు
 మిల మిల మెరిసేటి నీకళ్ళు
 నా ముందుకు వస్తున్నాయి
 నీ విందును నాకిస్తున్నాయి !

నే కలల అలలపై ఇక తేలుతూ
నీ కలల కాంతులను  ఏలుతూ
నా ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపిస్తా
నా శ్రమ సింహాసనాన్ని నీకు ఇస్తా!

నా ప్రేమలో నిన్ను ఇక ముంచేస్తా
నా అధరామృతాన్ని నీకు వంచేస్తా
నువ్వు గ్రోలుతూ నాతో ఉంటావు
నాప్రేమ తోపువు అని నన్నంటావు

నిన్ను నన్ను ఏకం చేసింది ఈప్రేమ
కన్ను మిన్ను కానక ఉండదు భామ
ప్రేమ వైనంనుకని మసులుకుందాం
ప్రేమే దైవమనిఇక తెలుసుకుందాం


కామెంట్‌లు